యాప్నగరం

మంగళంపల్లికి సినీ ప్రముఖుల నివాళి

గాన గంధర్వుడు, సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ భౌతికకాయానికి తెలుగు, తమిళ సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

TNN 23 Nov 2016, 2:56 pm
గాన గంధర్వుడు, సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ భౌతికకాయానికి తెలుగు, తమిళ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. చెన్నైలో మంగళవారం సాయంత్రం మంగళంపల్లి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ప్రముఖుల సందర్శనార్థం బుధవారం మంగళంపల్లి పార్థీవదేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు.
Samayam Telugu cinema industry politicians condolences to mangalampalli balamuralikrishna
మంగళంపల్లికి సినీ ప్రముఖుల నివాళి


సినీనటుడు కమల్ హాసన్, ప్రముఖ సినీ గాయకులు జె.ఏసుదాసు, మనో, వాణీ జైరాంతో పాటు సినీ, సాహిత్య ప్రముఖులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. బాలమురళీకృష్ణ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వారు అన్నారు. మంగళంపల్లి కుటుంభ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, బుధవారం సాయంత్రం చెన్నైలోని కన్నమాపేట శ్మశానంలో మంగళంపల్లికి అంత్యక్రియలు జరగనున్నాయి.





తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.