యాప్నగరం

నంది అవార్డు.. నాకెందుకు రాలేదు?

ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించడం తేనె తుట్టెను కదిపినట్టు అయ్యింది.

TNN 16 Nov 2017, 7:58 am
ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించడం తేనె తుట్టెను కదిపినట్టు అయ్యింది. ఒకేసారి మూడేళ్లకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు.. ఈ అవార్డుల జాబితాలో పేర్లు లేని సినిమా వాళ్లు ఇప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు మెగాఫ్యామిలీ వైపు నుంచి, ఇటు దర్శకుడు గుణశేఖర్ నుంచి నంది అవార్డుల ప్రకటన తీరుపై అసహనం వ్యక్తం అయ్యింది. మరోవైపు ప్రముఖ కమేడియన్ పృథ్వీ కూడా అసహన గళం విప్పారు.
Samayam Telugu comedian prudhvi expresses his displeasure over nandi awards
నంది అవార్డు.. నాకెందుకు రాలేదు?


నంది అవార్డుల జాబితా అంత గొప్పగా ఏమీ లేదని.. పృథ్వీ అన్నాడు. ఎంపిక కమిటీలో గిరిబాబు వంటి సీనియర్ ఉన్న ఎందుకిలా జరిగిందో అర్థం కాలేదని ఈ నటుడు అభిప్రాయపడ్డాడు. ‘లౌక్యం’ సినిమాకు గానూ తనకు ఉత్తమ కమేడియన్ అవార్డు వస్తుందని అనుకున్నాను అని, అయితే అది జరగలేదని పృథ్వీ అన్నాడు.

‘నీకు అవార్డు అందుకునే స్థాయి ఇంకా రాలేదురా.. అని కమిటీ వాళ్లు అనుకున్నారేమో...’ అని ఈ నటుడు వ్యాఖ్యానించడం విశేషం. అవార్డుల ప్రకటనకు ఇలా గ్యాప్ ఉండకూడదు అని.. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అవార్డులను ప్రకటిస్తే... సత్తా ఏమిటో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. కొని తెచ్చుకున్న అవార్డులు బయటకు వెళ్లినప్పుడు వెక్కిరిస్తాయని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో అన్నారని పృథ్వీ గుర్తు చేశారు.

ఈ విధంగా ఈ కమేడియన్ కూడా నంది అవార్డుల ప్రకటన తీరుపై అసహనాన్ని వ్యక్తం చేసినవారి జాబితాలోకి చేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.