యాప్నగరం

#ఆస్క్ కేటీఆర్: ‘వెన్నెల’ సమస్యకు ‘కేటీఆర్’ పరిష్కారం!

2005 లో 'వెన్నెల' సినిమాతో కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయమైన వెన్నెల కిషోర్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. టాప్ కమెడియన్‌గా దూసుకుపోతూ.. దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్‌గా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు.

TNN 29 Dec 2017, 2:54 pm
2005 లో 'వెన్నెల' సినిమాతో కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయమైన వెన్నెల కిషోర్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. టాప్ కమెడియన్‌గా దూసుకుపోతూ.. దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్‌గా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ షూటింగ్ విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ముచ్చట్లను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు వెన్నెల కిషోర్. తాజాగా తన సినిమా విషయాలను కాకుండా ప్రజాసమస్యను నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు వెన్నెల.
Samayam Telugu comedian vennela kishore request to ktr over manikonda roads
#ఆస్క్ కేటీఆర్: ‘వెన్నెల’ సమస్యకు ‘కేటీఆర్’ పరిష్కారం!


అసలు విషయాలనికి వస్తే.. తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గానే ఉంటారు. ట్విట్టర్ వేదికగా అనేక ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. తాజాగా గురువారం రాత్రి ఆస్క్ కేటీఆర్ పేరుతో లైవ్ చాట్‌లో పాల్గొన్నారు కేటీఆర్. ఈవిషయాన్ని తెలుసుకున్న కమెడియన్ వెన్నెల కిషోర్ తాను ఉంటున్న మణికొండ ప్రాంతంలో ఉన్న సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లారు.

“సర్.. నేను ప్రస్తావించే సమస్య కంటే చాలా ముఖ్యమైన సమస్యలు ఉంటాయని తెలుసు. అయినా మణికొండలో సరైన రోడ్లను ఏర్పాటు చేసే అవకాశాలేమైనా ఉన్నాయా? చాలా ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది” అని వెన్నెల కిషోర్ అడిగాడు.

Absolutely, soon. My promise to you & residents there https://t.co/gDEqsX6Dmx — KTR (@KTRTRS) December 28, 2017
దీనికి కేటీఆర్ వెంటనే సమాధానం ఇస్తూ... “తప్పకుండా.. చాలా తొందరగా ఆ పనిని పూర్తీ చేస్తాం.. నీకు, మణికొండ వాసులకు ప్రామిస్ చేస్తున్నానని” చెప్పారు కేటీఆర్. అంతేకాదు మరోమారు కలిసినప్పుడు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా సమస్యలపై చర్చించుకుందామంటూ కేటీఆర్ చెప్పారు. ఇంత వేగంగా కేటీఆర్ స్పందించిన తీరుతో వెన్నెల కిశోర్ ఫిదా అయిపోవడంతో పాటు త్వరలోనే మణికొండలో కొత్తరోడ్లు రావడం ఖాయం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కమెడియన్ వెన్నెల కిషోర్ చొరవతో మణికొండలో కొత్త రోడ్లు వస్తే.. ఆ కాలనీ వాసులకు అంతకంటే ఆనందం ఏముంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.