యాప్నగరం

ఇలాంటి నిర్ణయాలతో నటులపై తప్పుడు సంకేతాలు వెళ్తాయి

ప్రముఖ హస్య నటుడు విజయ్ తన నివాసంలో సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

TNN 11 Dec 2017, 6:04 pm
ప్రముఖ హస్య నటుడు విజయ్ తన నివాసంలో సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన అర్థంతరంగా తనువు చాలించడంపై ఇందిరానగర్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లోని పలువురు జూనియర్ ఆర్టిస్టులు కూడా ఆవేదన చెందుతున్నారు. విజయ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన టాలీవుడ్ నటులు అతడితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా హాస్యనటుడు ధన్‌రాజ్‌ మాట్లాడుతూ.. విజయ్‌ తల్లి పరిస్థితి చూస్తే చాలా బాధేస్తోంది. సినిమాల్లో అవకాశాల్లేక విజయ్ ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడంటే నేను నమ్మనని అన్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్‌ సినిమాతోపాటు మరో రెండు, మూడు సినిమాల్లోనూ విజయ్ నటిస్తున్నాడు. తను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియడంలేదు. ఇలా మమ్మలందరినీ వదిలి వెళ్లిపోవడం తప్పని ఆయన ఆవేదక వ్యక్తం చేశారు.
Samayam Telugu comedian vijay sai suicide tollywood actors condolences
ఇలాంటి నిర్ణయాలతో నటులపై తప్పుడు సంకేతాలు వెళ్తాయి


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలు ఉంటే తమతో చెప్పుకోవాలని అన్నారు. అలా కాకుండా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల నటులపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, దయచేసి ఆత్మహత్యలు లాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సీనియర్ నటుడు రంగనాథ్‌ ఆత్మహత్య చేసుకున్న సమయంలోనూ తాను ఇలాంటి విజ్ఞప్తినే చేసినట్టు ఆయన గుర్తుచేశారు. సీనియర్‌ నటుడు సురేష్‌ మాట్లాడుతూ.. ఒక్క సెకనులో తీసుకున్న ఇలాంటి నిర్ణయంతో ఆ కుటుంబానికి తీవ్ర నష్టం వాటిళ్లుతోందని.... మానసిక ఒత్తిళ్లకు గురైతే అవసరమైన మానసిక స్థైర్యాన్నిచ్చేలా కౌన్సిలింగ్‌ ఇస్తామని అన్నారు. అంతేకాకుండా నటీనటులకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహాయం చేస్తోందని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.