Controversial Actor Sri Reddy Says She Is Like A Saint Does Not Want To Get Married Only Wants To Do Social Work
Suresh Babuతో మాట్లాడి పెళ్లి చేసుకోమంటున్నారు: శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీరెడ్డి సొంత యూట్యూబ్ ఛానెల్‌ను తెరిచి తన ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అయితే మానలేదనుకోండి. తాజాగా యూబ్యూట్‌లో తొలిసారి శ్రీరెడ్డి తన ఫ్యాన్స్‌తో లైవ్ చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని శ్రీరెడ్డిని పెళ్లి గురించి అడిగారు. ఇందుకు ఆమె చెప్పిన సమాధానమేంటో చూడండి.
Samayam Telugu23 Dec 2019, 12:20 pm
వివాదాస్పద నటి శ్రీరెడ్డి సొంత యూట్యూబ్ ఛానెల్‌ను తెరిచి తన ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తోంది. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అయితే మానలేదనుకోండి. తాజాగా యూబ్యూట్‌లో తొలిసారి శ్రీరెడ్డి తన ఫ్యాన్స్‌తో లైవ్ చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని శ్రీరెడ్డిని పెళ్లి గురించి అడిగారు. ఇందుకు ఆమె చెప్పిన సమాధానమేంటో చూడండి.
సేవ చేస్తా.. పెళ్లి వద్దు
‘‘నాకు పెళ్లి పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. నేను సన్యాసిని టైప్. ఈ జన్మను సమాజ సేవకే అంకితం చేయాలని అనుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన ఘోరమైన సంఘటనలు, అవమానాలతో ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించాలని అనుకోవడం లేదు. సమాజానికి సేవ చేస్తాను. ఏదో మీడియా ముందు పోజులివ్వడానికో, మంచిదాన్ని అని నిరూపించుకోవడానికో కాదు మనస్ఫూర్తిగా సమాజ సేవ చేయాలని అనుకుంటున్నాను. కానీ నన్ను సోషల్ మీడియాలో 70 లక్షల మంది ఫాలో అవుతున్నారు. వారందరికీ స్ఫూర్తిగా నిలవాలని అనుకుంటున్నాను. నేను గతంలో చాలా తప్పులు చేసి ఉండొచ్చు. భవిష్యత్తులో నేను వంద శాతం పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేనేమీ పర్ఫెక్ట్ మహిళను కాను. కానీ నేను చేసే మంచి పనులను చూసి నా ఫాలోవర్స్ కొంతలో కొంత స్ఫూర్తిచెందితే చాలు’’
నిర్మాణ సంస్థ పెడుతున్నా
‘‘నేను మంచి ఫుడ్ తీసుకుంటూ సన్నగా హాట్‌గా తయారవ్వాలని అనుకుంటున్నాను. ఎవరికైతే నా ఫిగర్ ఇష్టమో వారి కోసం కత్తిలా మారి చూపించబోతున్నాను. మరో విషయం ఏంటంటే.. త్వరలో శ్రీరెడ్డి ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నాను. సినీ పరిశ్రమలో అవకాశాలు దొరక్క కష్టపడుతున్న ఫ్రెషర్స్ కోసం అవకాశాలు ఇస్తాను. ముందు తమిళనాడుకు చెందిన వారికే అవకాశాలు ఇస్తాను. ఆ తర్వాత తెలుగు వారి గురించి ఆలోచిస్తాను. నేను సినిమా అవకాశాల కోసమే కాదు షార్ట్ ఫిలింస్ కోసం కూడా చాలా కష్టపడ్డాను. నేను పడిన బాధలు ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నవారు పడకూడదు’’
ఎవరితో పడుకుందో అంటారు
‘‘హైదరాబాద్‌లో ప్రొఫెషనల్‌గా ఓ మహిళ ఎదుగుతుంటే.. ఎవరో సాయం చేసి ఉంటారనో, లేకపోతే ఎవరితోనో పడుకుంది కాబట్టి అవకాశాలు వచ్చాయనో అంటుంటారు. కానీ తమిళనాడులో అలాంటి అవమానాలు, కామెంట్స్ ఏమీ ఉండవు. అందుకే నాకు ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది. నా జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. దాని నుంచి బయటపడటానికి మెడిటేషన్‌ను ఎంచుకున్నాను. వాటి నుంచి బయటపడటానికి చాలా చేస్తున్నాను. వాటి గురించి నేను మీతో అవకాశం వచ్చినప్పుడు పంచుకుంటాను’’
ఆయనే నా జీవితాన్ని మార్చింది
‘‘నా జీవితాన్ని మార్చింది ఎవరంటే..చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన ప్రసంగాలు వినే నేను డిప్రెషన్ నుంచి బయటపడ్డాను. నేను అబద్ధాలు చెప్పను. తూలి పడిపోయేలా మద్యం తాగను. నా ఫ్రెండ్స్ వస్తే చిన్న పెగ్ వైన్ తాగుతాను. నా జీవితం ఏంటో మీకు తెలుసు. నేను ఎవరెవరితో తిరిగానో కూడా మీకు తెలుసు. మనది చిన్న జీవితం. దాని గురించి గొప్పగా చూపించుకోవడానికి నానా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను పెళ్లికి ఎందుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానంటే.. పెళ్లైతే భర్త, పిల్లలు ఉంటారు. మళ్లీ పిల్లలను చదివించుకోవాలి, ఆస్తులు సంపాదించి పెట్టాలి.. ఇలాంటి తల నొప్పులు చాలా ఉంటాయి. ఉన్న చిన్న జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అనుకుంటున్నాను. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వారితో సమయం గడిపితే.. మనకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ప్రపంచమే నా ఫ్యామిలీ అనుకుంటే అసలు ఏ బాధా ఉండదు’’
ఇష్టపడుతుంటాను. ఇలాంటి కల్చర్ చెన్నైలో ఎక్కువగా ఉంటుంది. కానీ హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు తలలో పూలు పెట్టుకుంటే అదోలా చూస్తారు. నాకు విలేజ్ కల్చర్ ఇష్టం. కానీ హైదరాబాద్‌లో అలా ఎవరూ ఉండరు. నేను పార్టీలకు వెళ్తే వేరే కల్చర్ ఫాలో అవుతాను. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పద్ధతిగా ఉంటాను’’
సురేష్ బాబుతో మాట్లాడి పెళ్లి చేసుకోమన్నారు
‘‘ఆడపిల్లలు నాలాగా భద్రకాళిగా ఉండకపోతే భయపడే నాథుడు ఉండడు. నేను ఒకప్పుడు మీడియా ముందుకు వచ్చి అన్నీ బయటపెట్టాక ఇప్పుడు నాకు మెసేజ్‌లు కాల్స్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. నీలాగా మేమూ ధైర్యవంతులుగా ఉంటే చాలక్కా అంటూ చాలా మంది అన్నారు. వారి మాటలు చాలు. నాకు ఏ అవార్డులు అవసరం లేదు, ఏ సినిమా అవకాశాలూ వద్దు. సురేష్ బాబుతో మాట్లాడి అభిరాంను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు కద అక్కా అని చాలా మంది సలహాలు ఇచ్చారు. వారందరికీ నేను ఇచ్చే సమాధానం ఒక్కటే. ఎన్ని కోట్లు ఉన్నా ప్రశాంతత అనేది ఒకటి ఉంటుంది. అది లేకపోతే బీపీ, షుగర్, గుండెనొప్పులు వస్తాయి. మనకు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండటం కావాలి. అవి లేకపోతే మన దగ్గర ఎన్ని కోట్లు ఉండి ఏం లాభం’’
సినిమాలు లేకపోయినా ఫర్వాలేదు
‘‘ఇక్కడి ప్రజలకు సేవ చేయాలని ఉంది. టాలెంట్ ఉన్నవాళ్లకు చెన్నై చాలా మంచి ప్రదేశం. కానీ హైదరాబాద్‌లో పేరున్న కుటుంబాలే ఇండస్ట్రీని ఏలుతుంటాయి. అదీకాకుండా నేను నిరూపించుకోవడానికి నాకంటూ తక్కువ సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోనే నేనేంటో నిరూపించుకోవాలి. ఇక ముసలిదాన్ని అయిపోయాక అప్పుడే ప్రయత్నించి ఉంటే బాగుండేది అని ఏడ్చి మొత్తుకున్నా ఒరిగేది ఏమీ ఉండదు. ఇక నా సినిమా కెరీర్ గురించి చెప్పాలంటే.. నేను డబ్బు కోసం సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. నేను సమాజ సేవ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీడియా ఛానెల్స్ మనల్ని ఒక్కోసారి మంచిగా చూపిస్తాయి, చెడుగా చూపిస్తాయి. కానీ అసలు నేనేంటి అనేది ఎవ్వరికీ తెలీదు. నాకు మంచి అవకాశాలు వస్తే తప్పకుండా సినిమాలు చేస్తాను. ఒకవేళ నాకు అవకాశాలు రాకపోతే వేరే కెరీర్ చూసుకుంటాను. అంతేకానీ అవకాశాల కోసం నా టైం వేస్ట్ చేసుకోవాలని అనుకోవడం లేదు’’
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.