యాప్నగరం

డీజే ‘గుడిలో’ రగడ: అస్మైక త‌స్మైక రస్మైక

అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘దువ్వాడ జగన్నాథం’ మూవీలోని ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో ’ సాంగ్‌పై వివాదం రేగింది.

TNN 2 Jun 2017, 2:28 pm
‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’ అంటూ డీజే సాంగ్ రిలీజ్ అయ్యి యూట్యూబ్‌లో 5 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి దువ్వాడ జగన్నాథం దుమ్ములేపేశాడు. ఇటీవల విడుదలైన డీజే తొలిసాంగ్ ‘శరంణం భజే భజే’ సాంగ్‌‌ను మించి ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’ సెకండ్ సింగిల్ సాంగ్‌కు రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.
Samayam Telugu controversy on dj second single
డీజే ‘గుడిలో’ రగడ: అస్మైక త‌స్మైక రస్మైక


అయితే ప్రస్తుతం ట్రెండింగ్‌లో టాప్‌లో ఉన్న ‘గుడిలో బడిలో సాంగ్’పై వివాదం రేగింది. ఈ పాటలో ఉపయోగించిన పదజాలంతో మనోభావాలు దెబ్బ తిన్నాయని బ్రాహ్మణ సామాజిక వర్గానికి కొందరు ప్రతినిధులు మీడియా కెక్కారు. రుద్రస్తోత్రంలో ఉపయోగించే మంత్రాన్ని అపహాస్యం చేస్తూ ఇందులో పదాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సినిమా మొదలైన నాటినుండి డీజే మూవీపై నిరసన సెగలు రేగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సాంగ్ విషయంలో మరింత వేడి రాజుకుంది. దువ్వాడ జగన్నాధంపై నిరసన తెలుపుతూ బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే సెన్సార్ బోర్డ్‌కు రాతపూర్వకంగా పిర్యాదు చేశారు.. డీజే మూవీపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సాంగ్‌లోని అభ్యంతరకర పదాలను తొలగించాల్సిందే అని.. లేనిపక్షంగా సినిమా విడుదలను అడ్డుకుంటా మంటూ హెచ్చరిస్తున్నారు.

ఈ వివాదానికి కారణమైన డీజేలోని ‘గుడిలో బడిలో మడిలో ఒడిలో’ సాంగ్ లిరిక్స్ ఒకసారి చూద్దాం..

అస్మైకయోగ త‌స్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకమార సుందరం

ఆ చంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాలం
ఆనంద తీర బృందా విహార మందార సాగరం

గుడిలో బడిలో మదిలో ఒడిలో నీ తలపే శశి వదనా
గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజ గమనా

ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం
ప్రవ‌రలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం
అగ్రహారాల తమలపాకల్లే తాకుతోంది తమకం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.