యాప్నగరం

విజయశాంతికి కోర్టు నోటీసులు

నటి, రాజకీయ నేత విజయశాంతికి మద్రాస్ హై కోర్టు నోటీసులు జారీ చేసింది.

TNN 18 Sep 2017, 8:18 am
నటి, రాజకీయ నేత విజయశాంతికి మద్రాస్ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక ఆస్తి వివాదానికి సంబంధించి విచారణకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. విజయశాంతి హాజరుకు ఆదేశిస్తూ కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. ఆస్తిని అమ్ముతానని విజయశాంతి తనతో డబ్బులు తీసుకుని.. మోసం చేసిందని ఇందర్ చంద్ అనే వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. అతడి పిటిషన్ ను విచారణకు తీసుకుంది న్యాయస్థానం.
Samayam Telugu court issues legal notices to vijayashanthi
విజయశాంతికి కోర్టు నోటీసులు


ఎగ్మూర్ లోని కొంత స్థిరాస్థిని తనకు అమ్ముతానని చెప్పి విజయశాంతి తన నుంచి నాలుగు కోట్ల రూపాయలపై మొత్తాన్ని తీసుకుందని అతడు ఆరోపించాడు. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కాలేదని, పవర్ ఆఫ్ అటార్నీ మాత్రం తన పేరుకు బదిలీ అయ్యిందని.. ఇప్పుడు ఆమె అవే ఆస్తులను వేరొకరికి అమ్ముతోందని ఇందర్ చంద్ పేర్కొన్నాడు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడింది. కోర్టుకు హాజరు కావాలని విజయశాంతిని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి(నేటికి) వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.