యాప్నగరం

నటిపై లైంగిక వేధింపులు: నటుడికి బెయిల్ నిరాకరణ

ప్రముఖ మళయాళం నటిపై లైంగిక వేధింపుల కేసులో ప్రమేయం వున్నట్టుగా పోలీసుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న...

TNN 15 Jul 2017, 6:26 pm
ప్రముఖ మళయాళం నటిపై లైంగిక వేధింపుల కేసులో ప్రమేయం వున్నట్టుగా పోలీసుల నుంచి ఆరోపణలు ఎదుర్కుంటున్న నటుడు దిలీప్‌కి బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది. తనకి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా దిలీప్ చేసుకున్న విజ్ఞప్తిని కొట్టిపారేసిన కోర్టు.. అతడిని జులై 25 వరకు జుడీషియల్ కస్టడీకి తరలించాల్సిందిగా పోలీసులని ఆదేశించింది.
Samayam Telugu court rejected dileeps bail plea and sent him to judicial custody
నటిపై లైంగిక వేధింపులు: నటుడికి బెయిల్ నిరాకరణ


నటిపై లైంగిక వేధింపుల కేసుని విచారిస్తున్న కొచ్చిలోని అంగమలి జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో దిలీప్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది దిలీప్‌కి బెయిల్ మంజూరు చేయించడం కోసం శతవిధాల ప్రయత్నించారు. "తన క్లయింట్ దిలీప్ సమాజంలో పేరున్న వ్యక్తి కనుక కోర్టు విధించిన షరతుల ప్రకారమే నడుచుకుంటాడని.. అలాగే ఒక నటుడిగా దిలీప్ అందరికీ సుపరిచితుడే కనుక అతడు తప్పించుకుని పారిపోవడానికి కూడా ఆస్కారమే లేదు" అని దిలీప్ తరపు న్యాయవాది కోర్టుకి విన్నవించారు.

ఇదిలావుంటే, దిలీప్‌కి బెయిల్ మంజూరు చేస్తే, అతడు సాక్ష్యాధారాలని మాయం చేసే ప్రమాదం వుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ కేసులో బెయిల్‌పై విడుదలై బయటికి వెళ్లిన పలువురు నిందితుల ఆచూకీ కనిపించడం లేదని వారు జడ్జికి తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దిలీప్ బెయిల్ పిటీషన్‌ని కొట్టిపారేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.