ఇష్టపడే అమ్మాయి రోజూ గంటల కొద్దీ చాటింగ్ చేస్తే, రోజూ పొద్దునే గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ నైట్ చెప్తే? సూపర్ ఫిగర్ మన ఫిగర్ అయితే ఇట్స్ రియల్లీ ఎ క్రేజీ.. క్రేజీ ఫీలింగ్ కదా? సరిగ్గా ఇదే కాన్సెప్టుతో 'నేను..శైలజ' చిత్రంలోని దేవీ శ్రీ ప్రసాద్ అందించిన 'క్రేజీ.. క్రేజీ ఫీలింగ్' అనే పాటకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. రామ్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'నేను శైలజ' అనే చిత్రం విడుదలై హీరో రామ్ కెరియర్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో హీరో రామ్ హీరోయిన్ తో ప్రేమలో పడి తన ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తాడు. ఆ సమయంలోనే ' కౌంపౌండ్ వాల్ ఎక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాలెక్కి మూన్ తాకినట్లుందే, మార్నింగ్ లేవగానే నీ మేసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్లుందే.. నిన్న మొన్న దాకా సూపర్ అన్న ఫిగర్ నిన్ను చూసినాకా సోసోగుందే' అంటూ సాగే లిరిక్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు చాలా మంది ఫిదా అయ్యారు. ఇంతవరకు ఏ తెలుగు సినిమా పాటకు రానంతగా యూట్యూబ్ లో ఈ పాటకు కోటికి పైగా హిట్స్ వచ్చాయి.'క్రేజీ క్రేజీ ఫీలింగ్' పాటకు కోటికి పైగా వ్యూస్ రావటం పట్ల హీరో రామ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్, లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి, ఇతర 'నేను శైలజ' మూవీ యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.
ఈ పాటకు క్రేజీ.. క్రేజీ.. క్రేజీ ఫీలింగ్
ఇష్టపడే అమ్మాయి రోజూ గంటల కొద్దీ చాటింగ్ చేస్తే, రోజూ పొద్దునే గుడ్ మార్నింగ్, నైట్ గుడ్ నైట్ చెప్తే? సూపర్ ఫిగర్ మన ఫిగర్ అయితే ఇట్స్ రియల్లీ ఎ క్రేజీ.. క్రేజీ ఫీలింగ్ కదా? సరిగ్గా ఇదే కాన్సెప్టుతో...
TNN 11 Jul 2016, 4:33 pm