యాప్నగరం

మహేశ్‌ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చిన వార్నర్.. ఈ వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తాజాగా ఆయన క్రియేట్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది.

Samayam Telugu 31 Dec 2020, 3:35 pm
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ తెలుగువారికి సుపరిచితుడే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరపున మెరుపులు మెరిపించడంతో పాటు తెలుగు సినీ పాటలకు డ్యాన్సులు వేస్తూ అలరిస్తుంటాడు. ఆయన టాప్ హీరోల పాటలు, డైలాగులకు తన మేనరిజాన్ని అప్లై చేసి ప్రేక్షకులను తరుచూ అలరిస్తుంటాడు. గతంలో మహేశ్‌బాబు పాటలకు స్పెప్పులు వేసి అదరగొట్టిన వార్నర్ న్యూ ఇయ్ వేళ సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌ మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
Samayam Telugu Image

View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)

మహేశ్‌బాబు 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను సెలక్ట్ చేసుకొని రీఫేస్ యాప్ సహాయంతో వార్నర్ ఓ వీడియోను రూపొందించాడు. అందులో మహేశ్ ఫేస్‌కి బదులుగా తన ఫేస్‌ని యాడ్ చేశాడు. కొన్ని డైలాగులకు ఎక్స్‌ప్రెషన్లు కూడా ఇచ్చాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సూపర్‌స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో నెటిజన్లతో పాటు మహేశ్‌ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.