యాప్నగరం

ఆ ప్రముఖ నిర్మాత జనసేనలోకి?

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. ఆ పార్టీ నిర్మాణం ఊపందుకోనున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ఆ పార్టీలో చేరనున్నారా?

TNN 25 Oct 2017, 5:53 pm
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు జనసేన పార్టీలో చేరనున్నారా? పవన్ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరు కావడమే ఈ అనుమానానికి ప్రధాన కారణం. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ, త్రివిక్రమ్, సత్యానంద్, ఎస్.రాధాకృష్ణ లాంటి పవన్ సన్నిహితులు వచ్చారు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఆసక్తి రేపుతోంది.
Samayam Telugu daggubati suresh babu will join jana sena party
ఆ ప్రముఖ నిర్మాత జనసేనలోకి?


ఫొటోగ్యాలరీ: జనసేన పార్టీ ఆఫీస్ లాంచింగ్ ఫొటోలు

సురేష్ ప్రొడక్షన్లో రూపొందిన గోపాల గోపాల సినిమాలో పవన్ వెంకటేష్‌తో కలిసి నటించారు. ఆ సమయంలో దగ్గుబాటి సురేష్‌తో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత కూడా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ మైత్రి కారణంగానే సురేష్ బాబు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ప్రారంభానికి వచ్చారా? లేదంటే జనసేన తరఫున పని చేయనున్నారా? అనే విషయంలో క్లారిటీ లేదు. సురేష్ బాబు పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా ఉంటారు. తన పర బేధాలను చూపించరు. అలాంటి వ్యక్తి మద్దతు జనసేనకు ఉంటే అది కచ్చితంగా పవన్ పార్టీకి ప్లస్ అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.