యాప్నగరం

'దర్శకుడు' రిలీజ్ డేట్ కన్ఫర్మ్

'కుమారి 21 F' లాంటి సక్సెస్‌ఫుల్ వెంచర్ తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న మరో సినిమా

Samayam Telugu 6 Jul 2017, 8:47 pm
'కుమారి 21 F' లాంటి సక్సెస్‌ఫుల్ వెంచర్ తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్న మరో సినిమా 'దర్శకుడు'. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాను హరి ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో వున్న ఈ సినిమాని జూన్ 9న విడుదల చేయాలని భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవడంతో ఆ తేదీని కాదనుకున్న మేకర్స్ తాజాగా ఆగస్టు 4న సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
Samayam Telugu darshakudu movie gets new release date
'దర్శకుడు' రిలీజ్ డేట్ కన్ఫర్మ్


కెరీర్ కోసం ఓ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన పోరాటమే ఈ డైరెక్టర్ సినిమా కథాంశం. క్రియేటివిటీ కలిగిన డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఓ సినిమాను నిర్మిస్తున్నాడు అంటే అది కచ్చితంగా కాన్సెప్ట్ వున్న సినిమానే అయ్యుంటుందనేది ఆడియెన్స్ నమ్మకం. 'కుమారి 21F'తో కుర్రకారులో ఓ నమ్మకం ఏర్పర్చుకున్న సుకుమార్.. దర్శకుడు సినిమాతో నిర్మాతగా మరోసారి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.