యాప్నగరం

చిరంజీవి 'సైరా' లో దాసరి కొడుకు?

టాలీవుడ్‌లో ఎందరో హీరోలకు లైఫ్ ఇచ్చారు దర్శకుడు దాసరి నారాయణరావు. కానీ అతడి కొడుకు అరుణ్ కుమార్‌ను మాత్రం నటుడిగా తీర్చిదిద్దలేకపోయాడు.

TNN 19 Nov 2017, 4:30 pm
టాలీవుడ్‌లో ఎందరో హీరోలకు లైఫ్ ఇచ్చారు దర్శకుడు దాసరి నారాయణరావు. కానీ అతడి కొడుకు అరుణ్ కుమార్‌ను మాత్రం నటుడిగా తీర్చిదిద్దలేకపోయాడు. అరుణ్ కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపును అయితే దక్కించుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీ అతడికి పిలిచి అవకాశాలు ఇస్తోంది. అల్లు శిరీష్ హీరోగా నటిస్తోన్న 'ఒక్క క్షణం' సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అరుణ్ కుమార్ కనిపించబోతున్నాడు. డిసెంబర్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samayam Telugu dasari arun kumar negative role in chiru sye raa movie
చిరంజీవి 'సైరా' లో దాసరి కొడుకు?


అయితే ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రంలో అరుణ్ కుమార్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సై.. రా నరసింహారెడ్డి' చిత్రంలో ఓ పాత్ర కోసం అరుణ్ కుమార్‌ను సంప్రదించారట. ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపడంతో దాదాపుగా సైరాలో ఆయన కనిపించడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం ఆయన లుక్, గెటప్‌కు సంబంధించి కొన్ని ట్రయిల్స్ వేయబోతుందట చిత్రబృందం. ఈ మూవీలో కూడా అరుణ్ నెగిటివ్ రోల్‌‌లో కనిపిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలు గనుక సక్సెస్ అందుకుంటే ఇక నటుడిగా అరుణ్ బిజీ అయిపోవడం ఖాయమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.