యాప్నగరం

ఆస్పత్రి నుంచి దాసరి డిశ్చార్జ్

దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇవాళ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్ర..

Samayam Telugu 28 Mar 2017, 7:04 pm
దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇవాళ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో తీవ్ర అస్వస్థతకి గురైన దాసరి నారాయణ రావు జనవరి 29న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచీ నిపుణుల పర్యవేక్షణలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు దాసరి.
Samayam Telugu dasari narayana rao discharged from kims hospital today
ఆస్పత్రి నుంచి దాసరి డిశ్చార్జ్


ఆస్పత్రిలో చేరిన మొదటి రెండురోజుల్లోనే శస్త్ర చికిత్స సహాయంతో శరీరంలోని ఇన్‌ఫెక్షన్స్‌ని తొలగించినప్పటికీ... పూర్తి ఆరోగ్యంగా కోలుకోవడానికి ఆయనకి రెండు నెలలు పట్టింది. ఎట్టకేలకి దాసరి పూర్తి ఆరోగ్యంగా వున్నారని నిర్ణారించుకున్న ఆస్పత్రి వైద్యులు ఇవాళ సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.