యాప్నగరం

జయలలితపై బయోపిక్ తెరకెక్కించనున్న దాసరి ?

ప్రస్తుతం వివిధ రంగాల్లోని సెలబ్రిటీలు, వీఐపీలు, ప్రముఖ రాజకీయ నాయుకుల జీవితాల ఆధారంగా బయోపిక్‌లు తెరకెక్కించే....

Samayam Telugu 3 Jan 2017, 11:25 pm
ప్రస్తుతం వివిధ రంగాల్లోని సెలబ్రిటీలు, వీఐపీలు, ప్రముఖ రాజకీయ నాయుకుల జీవితాల ఆధారంగా బయోపిక్‌లు తెరకెక్కించే సీజన్ నడుస్తోంది. అదే కోవలో తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్ర ఆధారంగానూ ఓ సినిమాకి ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు ఈ సినిమాని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫిలింఛాంబర్‌లో అమ్మ పేరిట ఆయన ఓ టైటిల్ రిజిష్టర్ చేయడం వెనుక కారణం అదే అయ్యుంటుందని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.
Samayam Telugu dasari narayana rao to direct jayalalithaas biopic
జయలలితపై బయోపిక్ తెరకెక్కించనున్న దాసరి ?


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా, వివిధ భాషల్లో నటించిన సినిమా హీరోయిన్‌గా దేశ వ్యాప్తంగా పరిచయం వున్న ప్రముఖురాలు కావడంతో జయలలిత బయోపిక్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించే యోచనలో దాసరి వున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో ఎంత నిజం వుందనేది తెలియాలంటే, అమ్మ మూవీపై ఓ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.