యాప్నగరం

బాక్సాఫీస్: ‘ధడక్’కు భారీ కలెక్షన్స్!

బాలీవుడ్ సినిమా ‘ధడక్’ భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెరకు పరిచయం అయిన సినిమాగా ఆసక్తి రేపిన ‘ధడక్’ తొలి రోజు,

Samayam Telugu 22 Jul 2018, 4:25 pm
బాలీవుడ్ సినిమా ‘ధడక్’ భారీ వసూళ్ల దిశగా సాగుతోంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెరకు పరిచయం అయిన సినిమాగా ఆసక్తి రేపిన ‘ధడక్’ తొలి రోజు, రెండో రోజు కూడా భారీ వసూళ్లను సాధించుకుంది. శుక్రవారం ఈ సినిమా విడుదల అయ్యింది. ఆ రోజున దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించుకుంది. ఇక రెండో రోజు శనివారం, వీకెండ్ ప్రభావంతో మరింత భారీ వసూళ్లను సాధించుకుంది. శనివారం ఈ సినిమాకు పది కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయని సమాచారం.
Samayam Telugu DHADAK4


ఇలా తొలి రెండు రోజుల్లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించుకుంది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ టాక్ నేపథ్యంలో రెండో రోజు కూడా భారీ వసూళ్లు వచ్చాయి. ఆదివారం కూడా ఈ సినిమాకు పది కోట్ల రూపాయల వరకూ వసూళ్లు దక్కి ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. యూత్‌ను ఆకట్టుకోవడం, పాజిటివ్ టాక్, జాన్వీ కపూర్ ఇంట్రడక్షన్ సినిమా కావడంతో ధడక్‌కు వసూళ్లు వెల్లువెత్తుతున్నాయి.

దీన్ని దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జొహార్ ఈ సినిమాను నిర్మించాడు. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకపోయినప్పటికీ ఈ సినిమా పెట్టుబడులను రాబట్టుకోవడంతో పాటు భారీ లాభాలను సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.