యాప్నగరం

బీచ్‌లో చీరకట్టుకోవాలా? విప్పితే మీకేంటి నష్టం!

తాను వేసుకున్న దుస్తుల విషయంలో అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాధికా ఆప్టే.

TNN 10 Mar 2018, 3:41 pm
ఎలాంటి విషయాన్నైనా ముక్కుసూటిగా కుండబద్దలగొట్టినట్లు మాట్లాడుతూ తరచూ వార్తల్లో నిలిచే రాధికా ఆప్టే మరోసారి హాట్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. తాను వేసుకున్న దుస్తుల విషయంలో అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారామె. ఇటీవల తన భర్తతో కలిసి ఏకాంతంగా గడిపేందుకు గోవా బీచ్‌కి వెళ్లింది ఈ సుందరి. అక్కడ బీచ్‌లో బికినీ ధరించి తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆమె ధరించిన దుస్తుల విషయంలో చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేయడంతో తనదైలిలో స్పందించారు రాధికా ఆప్టే.
Samayam Telugu dear trolls dont expect radhika apte to wear sari on the beach
బీచ్‌లో చీరకట్టుకోవాలా? విప్పితే మీకేంటి నష్టం!


నేను వేసుకున్న దుస్తులపై పిచ్చి కామెంట్లు పెట్టేవాళ్ల గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదు. వాళ్లెవరో నాకు తెలియదు. ఇదో చెత్త విషయం. అయినా బీచ్‌తో నా భర్తతో కలిసి వెళితే అభ్యతరం ఏంటి? బీచ్‌లో నాకు సౌకర్య వంతంగా ఉండే బట్టలు వేసుకుంటా.. అది నా ఇష్టం. బీచ్‌లో చీరలు కట్టుకోమని సలహా ఇచ్చే వారి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా స్పందించారు ఆప్టే.

ఇక ఈమె నటించిన ‘ప్యాడ్‌మ్యాన్‌’ చిత్రంపై రాస్తున్న రివ్యూలను తాను చదవలేదని.. ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చిందనే విషయం తనకు అర్థమైందన్నారామె. రాధికా ఆప్టే తెలుగులో బాలయ్య సరసన ‘లెజెండ్‌’, ‘లయన్‌’ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.