యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మావత్’ పబ్లిక్ టాక్!

‘పద్మావత్’ గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌తో పాటు యావ‌త్ సినీ ప్ర‌పంచాన్నీ కుదిపేసింది ఈ చిత్రం.

TNN 25 Jan 2018, 1:17 pm
‘పద్మావత్’ గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌తో పాటు యావ‌త్ సినీ ప్ర‌పంచాన్నీ కుదిపేసింది ఈ చిత్రం. అనేక వివాదాలు, విమ‌ర్శ‌ల నడుమ ‘పద్మావత్’(పద్మావతి) ఎట్టకేలకు ఈరోజు (జనవరి 25న) విడుదలైంది. అయితే ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రదర్శితం కావడంతో ఈ మూవీపై అనేక అనుమానాలను పటాపంచలు చేస్తూ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. విడుదలకు ముందే ‘పద్మావత్’ పేరు మార్మోగిపోవడంతో ఈ సినిమాని చుట్టుముట్టిన వివాదాలే ‘పద్మావత్’‌కు హెల్ప్ అయ్యాయి.
Samayam Telugu deepika padukone starrer padmaavat movie response in telugu states
తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మావత్’ పబ్లిక్ టాక్!


ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మావత్‌’ చిత్రం భారీగానే విడుదలైంది. సుమారు 400పైగా థియేటర్లలో రిలీజైంది ‘పద్మావత్’. తెలుగు రాష్ట్రాల్లో హిందీ, తెలుగు (అనువాదం) భాషల్లో ‘పద్మావత్’ ప్రదర్శితమవుతోంది. తెలంగాణలో మంగళవారం నాడు (జనవరి 23న) ప్రీమియ‌ర్ షోలు ప‌డటంతో ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

చ‌రిత్ర‌ని చ‌రిత్ర‌గానే చూపిస్తున్నాం.. క‌ల్పితాలు లేవు.. అని ద‌ర్శ‌కుడు హామీ ఇచ్చినా, సెన్సార్ ఓకే చెప్పినా ఆందోళనలు ఆగకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పద్మావత్‌కు నిరసన సెగ తప్పదని భావించారు. అయితే ఈ సినిమాను వ్యతిరేకించిన వారు ‘పద్మావత్’ చిత్రాన్ని చూసిన తరువాత తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

కాగా తెలంగాణలోని కరీంనగర్‌లో భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ‘పద్మావత్’ మూవీ విడుదలపై ఆందోళన చేపట్టారు. సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్‌ వద్ద ‘పద్మావత్’ చిత్ర యూనిట్‌కు శవయాత్ర నిర్వహించి దిష్టి బొమ్మలను దగ్థం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన చోట్ల ‘పద్మావత్‌’ షోలు ప్రశాంతంగానే ప్రదర్శితమవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.