యాప్నగరం

శ్రీదేవికి.. దేవీశ్రీ అంకిత మిచ్చిన పాట ఇదే!

‘రంగస్థలం’ రెండో జానపద పాటను పూర్తిగా సాంప్రదాయ సంగీత వాద్యాలతో రూపొందించినట్లు దేవీ వెల్లడించాడు.

TNN 1 Mar 2018, 10:37 am
సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్.. ప్రముఖ నటి శ్రీదేవికి ‘రంగస్థలం’ సినిమాలోని ఓ పాటను అంకితమిచ్చాడు. శ్రీదేవి మరణానికి దేవీ సంతాపం వ్యక్తం చేస్తూ ఇప్పటికే ప్రేక్షకుల ఆధరణ పొందుతున్న ‘ఎంత సక్కగున్నావే లచ్చిమీ’ పాటను ఆమెకు అంకితమిచ్చాడు. అలాగే, ‘రంగస్థలం’లోని ‘రంగ రంగ రంగస్థలాన్నా’ పాట విడుదల తేదీనికి కూడా ప్రకటించాడు. ఈ విషయాన్ని దేవీ ట్వీట్టర్ ద్వారా తెలిపాడు.
Samayam Telugu devi sri prasad dedicates rangasthalam song to sridevi
శ్రీదేవికి.. దేవీశ్రీ అంకిత మిచ్చిన పాట ఇదే!


‘‘అత్యంత ఆధరణ పొందుతున్న ఎంత సక్క గున్నావే పాటను లెజెండ్రీ శ్రీదేవి గారికి అంకితం ఇస్తున్నా. అలాగే, రంగ స్థలంలోని మరో ఒరిజినల్ ఫోక్ రిథమ్ ప్లేయర్స్‌ను మార్చి 2వ తేదీన పరిచయం చేయబోతున్నా’’ అని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా యూట్యూబ్‌లో ఓ వీడియో కూడా విడుదల చేశాడు. ‘రంగస్థలం’ రెండో జానపద పాటను పూర్తిగా సాంప్రదాయ సంగీత వాద్యాలతో రూపొందించినట్లు దేవీ వెల్లడించాడు. దీంతో, ఈ పాటపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ పాట చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!!

దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, ఆది, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎరినేని, రవిశంకర్ ఎరినేని, మోహన్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.