యాప్నగరం

విచారణలో పోలీసులతో కామెడీ చేస్తున్న స్టార్‌హీరో!

నటిపై దాడి కేసులో అరెస్టైన మలయాళ నటుడు దిలీప్ పోలీసు విచారణలో తమాషాగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

TNN 15 Jul 2017, 8:20 am
నటిపై దాడి కేసులో అరెస్టైన మలయాళ నటుడు దిలీప్ పోలీసు విచారణలో తమాషాగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. కోర్టు అనుమతి మేరకు దిలీప్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులకు దిలీప్ ఏ మాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. వారు వివిధ అంశాలపై ప్రశ్నలు అడుగుతుండగా దిలీప్ అస్సలు సమాధానాలు చెప్పడం లేదని సమాచారం. పోలీసులు సీరియస్ గా ప్రశ్నలు అడిగితే దిలీప్ మాత్రం కామెడీ చేస్తున్నాడట!
Samayam Telugu dileep not cooperate with police
విచారణలో పోలీసులతో కామెడీ చేస్తున్న స్టార్‌హీరో!


వాళ్లు అడిగిన ప్రశ్నలకు తింగరి తింగరిగా సమాధానాలు చెప్పడం, సీరియస్ గా ప్రశ్నలు అడిగితే సరదా సమాధానాలు చెప్పడం, జోకులు వేయడం.. ఇదీ తీరు. పోలీసుల విచారణకు సహకరించకుండా ఇలాంటి తీరుతో దిలీప్ సమయాన్ని వ్యర్థం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కోర్టు దిలీప్ ను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ రెండు రోజుల పాటు పోలీసులకు ఎలాంటి క్లూ ఇవ్వకుండా తప్పించుకోగలిగితే.. తర్వాత బెయిల్ తెచ్చుకుని బయటపడిపోవచ్చనేది దిలీప్ వ్యూహంగా తెలుస్తోంది.

అందుకే పోలీసులు ఏం అడిగినా.. సమాధానాలు చెప్పకుండా, నటుడిగా తన టాలెంట్ ను అంతా ప్రదర్శిస్తున్నాడట ఈ మలయాళీ హీరో. దీంతో పోలీసులు తలపట్టుకున్నారు. సినిమాల్లో కామెడీ చేసిన తీరున, విచారణలో కూడా ఇతడు తింగరితింగరి మాటలతో తను తప్పించుకునే యత్నాన్ని చేస్తున్నాడు. దిలీప్ పక్కా క్రిమినల్ అని, ఒకవైపు తను అమాయకుడిని అంటూనే.. పోలీసుల విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్లాన్ ను అమలు చేస్తున్నాడనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయిప్పుడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.