యాప్నగరం

Son Of India డిజాస్టర్‌.. మోహన్ బాబు ఫోన్ చేసి ఆ మాట అన్నారు.. పవన్‌తో సినిమా పోయింది: డైమండ్ రత్నబాబు

సన్నాఫ్ ఇండియా (Son Of India) డిజాస్టర్‌పై డైరెక్టర్ డైమండ్ రత్నబాబు (Ratnababu) స్పందించారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చలేదన్నారు. ఈ మూవీ తరువాత తన ఫోన్లు ఎవరు లిఫ్ట్ చేయలేదని చెప్పారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 24 Sep 2022, 11:52 am
డైలాగ్ కింగ్ మోహన్ బాబు టైటిల్ రోల్‌లో డైమండ్ రత్నబాబు (Ratnababu) దర్శకత్వంలో రూపొందిన మూవీ సన్నాఫ్ ఇండియా (Son Of India). ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై డైరెక్టర్ రత్నబాబు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. సన్నాఫ్ ఇండియా డిజాస్టర్‌గా నిలవడంతో పవన్ కళ్యాణ్‌తో మూవీ చేసే ఛాన్స్ మిస్సయిందన్నారు.
Samayam Telugu Mohan Babu, Ratna Babu
మోహన్ బాబు, రత్నబాబు


''సన్నాఫ్ ఇండియా మూవీలో బండ్ల గణేష్ గారు ఓ క్యారెక్టర్ చేశార. ఆ టైమ్‌లో ఆయన కథ బాగా విన్నారు. అదిరిపోయింది తమ్ముడు అని మెచ్చుకున్నారు. చాలా బాగా చేశావని.. తరువాత పవన్ కళ్యాణ్‌తో సినిమా ఇప్పిస్తానని కథ రెడీ చేసుకోమన్నారు. కథ రెడీ చేసి చెప్పా. బ్రహ్మాండంగా ఉంది చేద్దామన్నారు. 'మెకానిక్' అనే టైటిల్ పెట్టా. 'రాష్ట్రం రిపేర్‌కు వచ్చింది' అనేది క్యాప్షన్. సన్నాఫ్ ఇండియా సినిమా తరువాత పవన్ కళ్యాణ్ గారితో చేద్దామనుకున్నా.

కానీ దేవుడు ఒకటి శాసించాడు. సన్నాఫ్ ఇండియా డిజాస్టర్ తరువాత ఎవరు ఫోన్లు ఎత్తలేదు. సినిమా సక్సెస్ అయితే అందరూ పార్టీలకు పిలుస్తారు. ఫెయిల్ అయితే ఇరానీ ఛాయ్ తాగుదామని కూడా పిలవరు. ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. సక్సెస్ ఉంటే ఎవరైనా భుజం మీద చేయి వేసి మాట్లాడతారు. లేదంటే మన నీడ కూడా పక్కకు పోమ్మని చెబుతుంది. సన్నాఫ్ ఇండియా సినిమా తరువాత నా పని అయిపోయిందని అనుకున్నారు.

నా ఫోన్ సైలెంట్ అయిపోయిందనుకున్న టైమ్‌లో నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ మోహన్ బాబు గారి నుంచే. నేను బాధగా ఉంది సార్ అని చెప్పా. 'ఎందుకు బాధపడుతున్నావు. నువ్వు మంచి కథ చెప్పావు. ప్రయోగం అని చెప్పాం. పబ్లిక్ రిసీవ్ చేసుకోలేదు. అది నీ తప్పా. నీవు చాలా బాగా చేశావు. వండర్‌ఫుల్ మేకింగ్. నీకు మంచి భవిష్యత్ ఉంది. నువ్వు మంచి కథ చెప్తే.. నీతో చేయడానికి రెడీ..' అని మోహన్ బాబు గారు చెప్పారు. నేను ఆయను డిజాస్టర్ ఇచ్చినా.. నా మీద నమ్మకంతో మరో సినిమా చేస్తానని అన్నారు. ఆయన ఇచ్చిన మాటను ఎంకరేజింగ్‌గా తీసుకుని మళ్లీ సినిమాల వేట మొదలు పెట్టాను..'' అంటూ రత్నబాబు చెప్పుకొచ్చారు. అన్‌స్టాపబుల్ మూవీ షూటింగ్ పూర్తి అయిందని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.