యాప్నగరం

రారండోయ్ ‘కల్యాణ్ కృష్ణ’ వేడుక చూద్దాం!!

దర్శకుడిగా తొలి సినిమాతో హిట్ కొట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయితే కల్యాణ్ కృష్ణ మాత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో హిట్ అందుకున్నాడు.

TNN 25 May 2017, 9:15 pm
దర్శకుడిగా తొలి సినిమాతో హిట్ కొట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయితే కల్యాణ్ కృష్ణ మాత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో హిట్ అందుకున్నాడు. నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా హిట్ క్రెడిట్ పూర్తిగా కల్యాణ్‌కు దక్కలేదు. ఈ సినిమాకు కథ రామ్మోహన్ అందించడం మధ్యలో కొందరు రచయితలు జోక్యం చేసుకోవడం.. నాగార్జున రీషూట్స్ చేయడం.. ఇలా సోగ్గాడే సక్సెస్ వెనుక చాలా పెద్ద కథే ఉంది. పైగా సంక్రాంతికి సినిమా రావడం మరింత కలిసొచ్చింది.మొత్తానికి కల్యాణ్ కృష్ణకు తొలి సినిమా విజయం ఓ మ్యాజిక్‌లా జరిగిపోయింది.
Samayam Telugu director kalyan krishna recond film rarandoi veduka chuddam released tomorrow
రారండోయ్ ‘కల్యాణ్ కృష్ణ’ వేడుక చూద్దాం!!


అయితే ఆయనకు అసలు పరీక్ష ఇప్పుడు మొదలైంది. అతడి సత్తా ఏంటనేది.. రేపు తేలబోతుంది. ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా మీద పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ అయింది కానీ.. అంచనాలు అయితే లేవు.

చలపతిరావు వివాదం కారణంగా సినిమాకు పబ్లిసిటీ అయితే బాగా వచ్చింది. థియేటర్లకు జనాలను రప్పించడం కంటే.. వాళ్ళను కూర్చోబెట్టడం, సినిమాతో మెప్పించడం కీలకం. సోగ్గాడు సినిమాను నాగార్జున తన భుజంపై వేసుకొని నడిపించేశాడు. బంగార్రాజు క్యారెక్టర్ సినిమాకు బాగా ప్లస్ అయింది. కానీ ఇప్పుడు 'రా రండోయ్' విషయంలో అలాంటి వాటికి ఛాన్స్ లేదు. కథ, కథనాలు సినిమాను నడిపించాలి. మరి ఈ ద్వితీయ విఘ్నాన్ని కల్యాణ్ కృష్ణ ఎలా దాటుతాడో.. చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.