యాప్నగరం

చైతూ కొత్త సినిమా డీటేల్స్ ప్రకటించిన దర్శకుడు

తమ అభిమాన నటుడు చైతూ, సమంతను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడనే ఆనందంలో వున్న అక్కినేని ఫ్యాన్స్‌కి అతడి...

TNN 7 Oct 2017, 5:43 pm
తమ అభిమాన నటుడు చైతూ, సమంతను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడనే ఆనందంలో వున్న అక్కినేని ఫ్యాన్స్‌కి అతడి కొత్త సినిమా డీటేల్స్‌ని ప్రకటించి వారికి మరింత ఆనందాన్ని పంచాడు 'మహానుభావుడు' డైరెక్టర్ మారుతి. అవును, తన డైరెక్షన్‌లో చైతూ చేయనున్న సినిమా వివరాలని ఇవాళ మీడియాకు వెల్లడించాడు మారుతి. అక్టోబర్ 8న.. అంటే రేపు తన పుట్టిన రోజు కావడంతో అంతకన్నా ఒకరోజు ముందుగానే చైతూ కొత్త సినిమా వివరాలు ప్రకటించాడు.
Samayam Telugu director maruthi announces his next with nagachaitanya
చైతూ కొత్త సినిమా డీటేల్స్ ప్రకటించిన దర్శకుడు


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించనున్న ఈ సినిమాలో చైతూ సరసన అను ఎమ్మాన్యుయెల్ జంటగా నటించనుంది. మారుతి గత చిత్రాలైన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల్లో మాదిరిగా ఈ సినిమాలో హీరోకి ఏ లోపాలు వుండవట. వచ్చే నెలలో లాంచ్ కానున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఒకరు ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

తాను డైరెక్ట్ చేసిన మహానుభావుడు సినిమా బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతుండటంతో ఆ ఆనందంలో వున్న మారుతి అదే జోష్‌‌లో చైతూ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.