యాప్నగరం

నా రేటింగ్ 1/5.. సమంత సినిమా రూమర్‌పై నందినీరెడ్డి పంచ్

సమంతతో దర్శకురాలు నందినీరెడ్డి ఒక సినిమా చేస్తున్నారని.. ఇది రీమేక్ అని కొద్ది రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై నందినీరెడ్డి స్పందించారు.

Samayam Telugu 15 Apr 2020, 6:13 pm
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ఏకైక లేడీ డైరెక్టర్ నందినీరెడ్డి. ‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమై తొలి చిత్రంతోనే నంది అవార్డు దక్కించుకున్నారు. ఆ తరవాత సిద్ధార్థ్, సమంతతో ‘జబర్దస్త్’ సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అయితే, మూడో సినిమా ‘కళ్యాణ వైభోగమే’తో నందినీరెడ్డి ఆకట్టుకున్నారు. కిందటేడాది ‘ఓ బేబీ’తో హిట్టు కొట్టారు. సమంత నటించిన ఈ సినిమాతో నందినీరెడ్డికి కూడా మంచి పేరు వచ్చింది. సినిమా సినిమాకి కాస్త గ్యాప్ ఎక్కువగా తీసుకునే నందినీరెడ్డి వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు.
Samayam Telugu Samantha and Nandini Reddy
సమంత, నందినీరెడ్డి


ఇదిలా ఉంటే, ఆమె మరోసారి సమంతతో జతకడుతున్నారని గతకొద్ది రోజులుగా రూమర్లు వస్తున్నాయి. ఇది ఒక రీమేక్ చిత్రమని కూడా అన్నారు. అంతేకాదు, ఈ సినిమాలో తనతో పాటు నటించడానికి నాగచైతన్యను సమంత ఒప్పించారని కూడా వదంతులు వచ్చాయి. అయితే, వీటిపై తాజాగా నందినీరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. రూమర్లు సృష్టించేవారిపై పంచ్‌లు విసిరారు.

Also Read: రీల్ హీరో కాదు రియల్ హీరో సజ్జనార్: ఆర్జీవీ ఫిదా

‘‘నా తరవాత సినిమా రీమేక్ కాదు. అది ఒరిజినల్ స్క్రిప్ట్. స్వప్న సినిమా నిర్మిస్తోంది. ఒకవేళ సమంతతో నా తరవాత సినిమా చేస్తే మేమే ఎంతో ఆనందంగా ప్రకటిస్తాం. ఇప్పుడు, నెక్ట్ రూమర్ టైమ్ వచ్చింది. ఈ రూమర్‌కు నా రేటింగ్ 1/5. నిరుత్సాహపడొద్దు మీరింకా బాగా రూమర్లు సృష్టించగలరు’’ అంటూ చమత్కారంగా ట్వీట్ చేశారు నందినీరెడ్డి. ఈ ఒక్క ట్వీట్‌తో గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతోన్న రూమర్లకు చెక్ పెట్టినట్టయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.