యాప్నగరం

'అర్జున్ రెడ్డి'ని ఒప్పించిన లేడీ డైరెక్టర్!

'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఆ తరువాత 'జబర్దస్త్', 'కళ్యాణ వైభోగమే' వంటి సినిమాలను తెరకెక్కించారు.

TNN 4 Dec 2017, 7:33 pm
'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఆ తరువాత 'జబర్దస్త్', 'కళ్యాణ వైభోగమే' వంటి సినిమాలను తెరకెక్కించారు. కానీ మొదటి సినిమా తీసుకొచ్చినంత క్రేజ్ మిగిలిన సినిమాలు తీసుకురాలేకపోయాయి. దీంతో తనదైన స్టయిల్‌లో మరో సినిమా చేసి నిరూపించుకోవాలనుకుంటుంది.
Samayam Telugu director nandini reddy movie with vijay devarakonda
'అర్జున్ రెడ్డి'ని ఒప్పించిన లేడీ డైరెక్టర్!


విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసింది. ఆమెతో కలిసి వర్క్ చేయడానికి విజయ్ దేవరకొండ కూడా ఆసక్తి చూపించారు. కానీ ఆమె చెప్పిన కథకు మాత్రం నో చెప్పేశాడట. దీంతో ఆమె కొత్త కథను సిద్ధం చేసే పనిలో పడింది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్నాదత్.. నందినిరెడ్డికి సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. విజయ్ దేవరకొండ గతంలో స్వప్నాదత్ ప్రొడక్షన్ లో 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో నటించాడు. ఆమెతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా నందినిరెడ్డితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడనేది తాజా సమాచారం. మొత్తానికి ఏదో విధంగా హీరో డేట్స్ అయితే సంపాదించుకుంది. మరి ఈ సినిమాతో అయినా.. హిట్ అందుకొని తిరిగి అవకాశాలను దక్కించుకుంటుందేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.