యాప్నగరం

ఓరి నీ కవరింగో: బాలయ్య లవ్‌తోటే ఫ్యాన్స్‌ని లాగికొడతాడట!

బాలయ్య ఎక్కడకు వెళ్లినా బౌన్సర్స్ అవసరం లేదని.. ఆయనకు అభిమానులే బాడీగార్డ్స్ అని, ఒక వేళ ఎవరైనా మీద పడినా ప్రేమతోటే కొడతారని అది పెద్ద ఇష్యూ కాదన్నారు.

TNN 18 Aug 2017, 11:54 am
ఇటీవల నందమూరి బాల‌కృష్ణ‌ ‘పైసా వసూల్’ సెట్‌లో తన అసిస్టెంట్‌పై చేయిచేసుకోవడంతో ఆ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నేషనల్ మీడియా సైతం బాలయ్యను ఏకిపారేసింది. ఆ వేడి ఇంకా చాల్లారకముందే మరోసారి బాలయ్య చెంపదెబ్బతో వార్తల్లోకి ఎక్కాడు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచార సందర్భంలో బాలయ్యతో సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించి.. మీదపడిన తన అభిమాని చెంప పగలగొట్టేశాడు ఈ నందమూరి నటసింహం. ఈ ఇష్యూపై నందమూరి అభిమానులు గుర్రుగా ఉండగా బాలయ్య దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదిలాఉంటే నిన్న (గురువారం) పైసూల్ వసూల్ ఆడియో వేడుకలో ఆ మూవీ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ ఇష్యూపై స్పందిస్తూ.. తన దర్శకత్వ ప్రతిభనంతా చూపించేశాడు.
Samayam Telugu director puri jagannadh speech at paisa vasool audio launch
ఓరి నీ కవరింగో: బాలయ్య లవ్‌తోటే ఫ్యాన్స్‌ని లాగికొడతాడట!


‘జోరు వాన పడుతున్నా బాలయ్య కోసం ఆయన అభిమానులు ఎక్కడికీ కదలకుండా బాలయ్య లాగే మొండిగా ఉన్నారని మీ కాళ్లు పట్టుకోవాలనుందన్నారు. ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ.. బాలయ్య ఎక్కడకు వెళ్లినా బౌన్సర్స్ అవసరం లేదని.. ఆయనకు అభిమానులే బాడీగార్డ్స్ అని, ఒక వేళ ఎవరైనా మీద పడినా ప్రేమతోటే కొడతారని అది పెద్ద ఇష్యూ కాదన్నారు.

బాలయ్య కామన్ సెన్స్‌తో మాత్రమే కొడతారని ఈసారి మళ్లీ అలా కొడితే అదో లవ్ స్టోరీ మాత్రమే అనుకోవాలన్నారు పూరీ. ఆయన కొడితే ప్రేక్షకులు హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన అభిమానులతో ఉన్న అనుబంధం అలాంటిది. అది మీడియాకు తెలియక ఏవేవో రాస్తున్నారంటూ తన మార్క్ స్క్రిప్ట్‌‌ను బాలయ్య అభిమానులకు వినిపించారు.

అయితే పూరీ వ్యాఖ్యలపై సగటు ప్రేక్షకుడు మండి పడుతున్నాడు. తాము అభిమానించే హీరోలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంటే.. చేయి తగిలిందని చెంప పగలగొట్టేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నాడు. పూరీ చెప్పినట్టు తాము అభిమానించే హీరోలు కొడితే లవ్ మాత్రమే అని అనుకోవాలా? ఈరోజు హీరోలు కొట్టారు రేపన్న రోజున అభిమానించే దర్శకులు కూడా కొడితే.. అది కూడా లవ్వే అనుకోవాలా? తమ జేబులో డబ్బులు పెట్టి సినిమా చూస్తేనే వాళ్లు ఈ స్థాయిలో ఉన్నరనే నగ్న సత్యాన్ని మరవకూడదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సినిమాల్లో హీరోయిజం ప్రదర్శించినా.. బయట ప్రపంచంలో వాళ్లు హీరోలుకాలేరని.. వాళ్లని ఆ స్థాయికి తీసుకువచ్చిన అభిమానులు, ప్రేక్షకులే నిజమైన హీరోలని పూరీ తెలుసుకుంటే మంచిది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.