యాప్నగరం

పక్షులతో పూరీ ఓ శనివారం ఏం చేశాడంటే..

పూరీ జగన్నాథ్ అతని సినిమాలు చాలా రఫ్‌గా ఉంటాయి కాని అతను మాత్రం చాలా సాధుస్వభావంతో పక్షులను విపరీతంగా ప్రేమిస్తాడు.

TNN 10 Dec 2016, 9:43 pm
పూరీ జగన్నాథ్ అతని సినిమాలు చాలా రఫ్‌గా ఉంటాయి కాని అతను మాత్రం చాలా సాధుస్వభావంతో పక్షులను విపరీతంగా ప్రేమిస్తాడు. అతని పక్షులంటే చాలా ఇష్టం అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ జంతుప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Samayam Telugu director puri one saturday morning with my birds video
పక్షులతో పూరీ ఓ శనివారం ఏం చేశాడంటే..


తనకు సినిమాలతో పాటు మూగ జీవులతో ప్రేమగా మసులుకోవడమూ బాగా తెలుసంటున్నాడు. తాజాగా పూరీ ఈ శనివారం పక్షులతో గడుపుతూ ఓ శనివారం పక్షులతో అంటూ.. ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో రెండు పక్షులు పూరీని చూసిన వెంటనే ఆయన వద్దకు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చి భుజాలపైకి, తలపైకి ఎక్కి తెగ అల్లరి చేస్తూ కనిపించాయి. పూరీ కూడా వాటిని బాగా ఆడిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోతో పాటు పూరీ..‘దేవుడు పక్షులను ప్రేమించాడు, చెట్లను సృష్టించాడు.. మనుషులు పక్షులను ప్రేమించారు, పంజరాలను సృష్టించారు’ అంటూ ఒక ఫొటోను పోస్ట్‌ చేశారు. దీన్ని బట్టి ఆయనకు పక్షులంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. పూరీ పక్షులతో ఉన్న ఆ వీడియోపై మీరూ ఓలుక్కేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.