యాప్నగరం

దర్శకేంద్రుడి ఆగ్రహం.. రోజంతా ఏడుస్తూనే ఉన్న రంభ.. షూటింగ్ ప్యాకప్

బొంబాయి ప్రియుడు షూటింగులో హీరోయిన్ రంభపై దర్శకేంద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారంట. దీంతో బాగా ఫీలైపోయిన ఆమె రోజంగా ఏడుస్తూనే కూర్చోవడంతో ఆ రోజు షూటింగ్ ప్యాకప్ చెప్పేశారట.

Samayam Telugu 29 Oct 2020, 12:19 pm
తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు. హీరోయిన్లనూ అందంగా చూపించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతుంటారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన షూటింగ్‌ లొకేషన్లలోనూ అంతే సరదాగా ఉండేవారట. కానీ ఓ సందర్భంలో హీరోయిన్ రంభ‌పై కస్సుమన్నారంట దర్శకేంద్రుడు. జేడీ చక్రవర్తి, రంభ జంటగా ఆయన డైరెక్షన్లో ‘బొంబాయి ప్రియుడు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే
Samayam Telugu రంభ, రాఘవేంద్రరావు


Also Read: ఆ సినిమా ఆపేసినందుకు అందరూ తిట్టారు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చా: పవన్

ఈ చిత్రంలోని ‘గుప్పెడు గుండెను తడితే’ పాట గుర్తుంది కదా. ఇందులో హీరో రంభ నడుముపై బత్తాయిలు వేస్తుంటాడు. పాట షూటింగ్ గ్యాప్‌లో అందరూ కూర్చుని ఉన్న సమయంలో.. ‘డైరెక్టర్‌ గారు నీమీద పుచ్చకాయలు వేయిస్తారు’ అని చెప్పడంతో రంభ గట్టిగా నవ్వేసిందట. దీంతో చిరాకు పడ్డ రాఘవేంద్రరావు ‘మీరు నవ్వడం ఆపేశాక చెప్పండి. నేనొచ్చి షాట్‌ తీస్తా’ అని కోపగించుకుని వెళ్లిపోయారట.

Also Read: ‘నా లైఫ్ డేంజర్‌లో ఉంది.. కాపాడండి’.. సీఎంను వేడుకున్న డైరెక్టర్

రాఘవేంద్రరావు అలా అనేసరికి రంభ బోరున ఏడ్చేశారట. ఎవరు ఎంత నచ్చజెప్పినా ఆమె ఏడుపు ఆపకపోవడంతో ఈ రోజు పాటకు ప్యాకప్ చెప్పేసి... మరుసటి రోజు షూటింగ్ కొనసాగించారు. ‘షాట్‌లో నా తప్పు లేకుండా నన్ను అంటే నాకు కోపం వస్తుంది. నేను చాలా సెన్సిటివ్’ అని ఓ సందర్భంగా రంభ చెప్పుకొచ్చింది.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ అప్‌డేట్: సీత వచ్చేస్తోంది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.