యాప్నగరం

Ram Gopal Varma: అప్సరా రాణి.. కప్పేసిన ఆ లోపల పార్ట్స్ ఇంకెంత అందమో..: కామంతో రగిలిపోయిన వర్మ బూతు పురాణం

ఆహా.. సరిపోయారు ఇద్దరికీ ఇద్దరే. వర్మ కండల్ని చూసి థ్రిల్లర్ హీరోయిన్ ముగ్దురాలైంది. మనోడిలో దాగిఉన్న వికృత రసికుడ్ని బయటకు తీసుకువచ్చే కామెంట్ పెట్టింది.

Samayam Telugu 10 Aug 2020, 8:07 pm
తప్పులేదు.. ఈరోజు ఉదయం ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల వర్మను ఉద్దేశించి కొన్ని పద బంధాలను తన పాటలో వదిలాడు. వాటిని పద బంధాలు అనేకంటూ బూతు పదాలు అంటే కరెక్ట్. ‘చెబితే వినడు.. శఠుడు విటుడు.. వికృత రసికుడు.. నికృష్టుడు.. కసిలో ఖరుడు.. ముసలి జడుడు.. సెక్సోన్మాదుడు.. దుష్ భ్రష్టుడు.. గుడ్డల్లేని బొమ్మల్ని గుడ్లగూబై చూస్తాడు.. సృష్టిలోన వీడంత శృంగార ద్రోహి లేడు.. కల్లోకొచ్చిన కాష్మోరాతో కక్కుర్తి పడతాడు.. కామినీ పిశాచితో కంపెనీ పెట్టేస్తాడు.. బికినీ వేసిన బూతాలతో బిజినెస్ చేస్తాడు’ అంటూ వర్మను బండకేసి ఉతికినట్టు ఏకపీకుడు పీకారు.
Samayam Telugu ఆర్జీవీ, అప్సరా రాణి
rgv and apsara rani


అవును మరి.. పెద్దాయన వర్మని బాగా దగ్గర నుంచి చూసినట్టు ఉన్నాడు. లేకపోతే ఆర్జీవీలోని వికృత రసికుడ్ని ఇంతలా వర్ణించగలుగుతాడా? వర్మ ఎంతటి వికృత రసికుడో తాజా ట్వీట్‌తో మరోసారి రెచ్చిపోయాడు.

లాక్ డౌన్‌లో వరుస సినిమాలు, బూతు బొమ్మల్ని ఆన్ లైన్‌లో వదులి కాసులు కురిపించుకుంటున్న వర్మ.. ఒరిస్సా సుందరి అప్సరా రాణి (అసలు పేరు అంకిత)తో థ్రిల్లర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆమెతో సిట్టింగ్ తరువాత ఇప్పుడు డిన్నర్ అయ్యిందని ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ అనేక సందేహాలకు అవకాశం కల్పించిన వర్మ.. తాజాగా అప్సరా రాణి ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణమైన కామెంట్స్ చేశాడు.

వర్మకి కరోనా వచ్చి పోతాడని చాలా మంది ఆయనంటే గిట్టని వాళ్లు రూమర్స్ క్రియేట్ చేయడంతో డంబెల్స్ పట్టుకుని మరీ రంగంలోకి దిగిన వర్మ.. కండలు చూపిస్తూ.. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను.. సూపర్ ఫకింగ్ ఫైన్’ అంటూ వీడియో వదిలాడు.

ఇక ఇతగాడి కండలపై మోజు పెంచుకున్న థ్రిల్లర్ బ్యూటీ అప్సరా రాణి.. థ్రిల్ అయిపోతూ ‘సర్ జీ.. మీరు చాలా స్ట్రాంగ్.. మీ కండలు అదిరహో.. నిజమైన మోటివేషన్ అంటే మీరే’ అంటూ దండాలు పెట్టే ఎమోజీతో ట్వీటేసింది.

అసలే అప్సరారాణి.. ఆపై తన కండల్ని పొగుడుతూ కామెంట్ చేస్తే వర్మ ఊరుకుంటాడా?? తన కసిని, కామాన్ని అంతా ట్విట్టర్‌లో పెట్టేశాడు. ‘థాంక్స్ అప్సరా రాణి.. నా కండల సంగతి వదిలెయ్ కాని.. నీ శరీరంలోని ప్రతి చదరపు అంగుళం అద్భుతం.. కాని ఎక్స్ పోజ్ చేయకుండా బట్టలతో కప్పేసిన మిగిలిన అందాలు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో’ అని తనలోకి కామ పిశాచికి పని చెప్పాడు వర్మ. ఇప్పటికే అప్సరారాణితో అంగాంగ ప్రదర్శన చేయిస్తూ నయనానందం పొందుతున్న వర్మ.. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌పై కూడా ఇంత దారణమైన కామెంట్స్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. తూ.. నీ బతుకు నీ కూతురు వయసు ఉంటుంది ఆమెకు.. కొంచెమైనా డీసెంట్‌గా ఉండవా?? నువ్వు నీ తాగుబోతు మాటలు అంటూ కొంతమంది ఫైర్ అవుతుంటే.. వర్మ అభిమానులు మాత్రం ‘నువ్ కేక బాబాయ్ కరెక్ట్‌గా కనిపెట్టావ్.. మేం కూడా అదే ఆలోచిస్తున్నాం’ అని కామెంట్స్ చేస్తూ వర్మ శిష్యులు అనిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.