యాప్నగరం

Save Nallamala: నల్లమలపై గళం విప్పిన శేఖర్ కమ్ముల.. ప్రభుత్వ తీరుకి నిరసన

Sekhar Kammula Save Nallamala: సేవ్ నల్లమల ఉద్యమం ఊపందుకుంటోంది. ఒక్కొక్కరుగా ఈ ఉద్యమంలో గళం విప్పుతున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపకుండా అడవుల్ని ఖనిజ సంపదను కాపాడాలని పిలుపునిచ్చారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల.

Samayam Telugu 27 Aug 2019, 7:37 pm
సేవ్ నల్లమల అంటూ సోషల్ మీడియా వేదికగా గళం ఎత్తారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల. భారతదేశంలోనే రెండో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ అయిన నల్లమలలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ ఇప్పటికే ఉద్యమం ప్రారంభం కాగా.. దీనికి మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు శేఖర్ కమ్ముల.
Samayam Telugu sekhar kammula


ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన పోస్ట్ పెట్టారు. ‘‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది కాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల కాన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేసుకోకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యావరణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు శేఖర్ కమ్ముల.

కాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియాలో యురేనియం తవ్వకాలకు కేంద్రం ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తుండటంతో శేఖర్ కమ్ముల స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.