యాప్నగరం

శ్రీనువైట్ల జబర్దస్త్ కామెడీ షో!

దర్శకుడిగా పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శ్రీనువైట్ల ఇటీవల వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు.

TNN 13 Apr 2017, 8:27 pm
దర్శకుడిగా పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శ్రీనువైట్ల ఇటీవల వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్ట్ చేసిన 'మిస్టర్' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దర్శకత్వంతో పాటు వైట్ల మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.
Samayam Telugu director sreenu vaitla to venture into tv production
శ్రీనువైట్ల జబర్దస్త్ కామెడీ షో!


యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయిన వైవా హర్షతో శ్రీనువైట్ల ఓ కామెడీ షోను ప్లాన్ చేయబోతున్నాడట ఈ దర్శకుడు. దీన్ని బట్టి శ్రీనువైట్ల కన్ను యూట్యూబ్ బిజినెస్‌పై పడిందని తెలుస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ ద్వారా చాలా మంది లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు.

భవిష్యత్తులో సినిమాల కంటే యూట్యూబ్ మీదే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలు లేకపోలేదు. అందుకే తనకు ఇది కరెక్ట్ బిజినెస్ అని భావించిన వైట్ల కామెడీ షోను ప్లాన్ చేశాడు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మరి శ్రీనువైట్ల ఈ షోల వరకే పరిమితం అవుతాడో లేక వెబ్ సిరీస్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.