యాప్నగరం

ఎన్టీఆర్ బయోపిక్‌ నుంచి తప్పుకున్న తేజ?

ఎన్టీఆర్ బయోపిక్‌పై మరో న్యూస్ వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు తాను న్యాయం చెయ్యలేననిపించి... బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 25 Apr 2018, 8:09 pm
ఎన్టీఆర్ బయోపిక్‌పై మరో న్యూస్ వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు తాను న్యాయం చెయ్యలేననిపించి... బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. సినిమా కూడా పట్టాలెక్కిన తర్వాత సడన్‌గా తేజ తప్పుకోవడమంటే పెద్ద షాక్ అని చెప్పాలి. ఆయన తప్పుకోవడానికి పూర్తి కారణాలు తెలియకపోగా... సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
Samayam Telugu Ntr Biopic


ఇటీవలే బయోపిక్ షూటింగ్ హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలిరాగా... ఉపరాష్ట్రపతి వెంకయ్య క్లాప్ కొట్టారు. కొన్ని ముఖ్యమైన సీన్లను కూడా షూట్ చేశారు. ఇలాంటి సమయంలో తేజ తప్పుకుంటే కనుక మూవీకి ఇబ్బంది ఎదురైనట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.