యాప్నగరం

ఎన్టీఆర్ బయోపిక్, వెంకీల సినిమాలపై తేజ ప్రకటన

డైరెక్టర్ తేజ త్వరలోనే స్వర్గీయ నందమూరి తారకరామా రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్‌ని తెరకెక్కించనున్న...

TNN 20 Oct 2017, 8:01 pm
డైరెక్టర్ తేజ త్వరలోనే స్వర్గీయ నందమూరి తారకరామా రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్‌ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. నందమూరి నటసింహం బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది ? అసలు తేజ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడా లేదా ? అని తరచుగా వ్యక్తమవుతున్న సందేహాలకి ఫుల్‌స్టాప్ పెడుతూ తాజాగా తేజ తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Samayam Telugu director teja reveals about ntrs biopic and venkateshs films
ఎన్టీఆర్ బయోపిక్, వెంకీల సినిమాలపై తేజ ప్రకటన


ఈరోజు మధ్యాహ్నం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టిన తేజ.. త్వరలోనే విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు ప్రారంభం కానున్నాయని అందులో స్పష్టంచేశాడు. త్వరలోనే నటీనటుల వివరాలు, తేదీ, వేదిక ప్రకటిస్తానని, త్వరలోనే మరిన్ని వివరాలతో మీ ముందుకొస్తానని ఆ పోస్టులో పేర్కొన్నాడు తేజ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.