యాప్నగరం

‘నీ జన్మదినం.. నా పునర్జన్మం’.. ప్రేయసిపై కవిత రాసిన యంగ్ హీరో నవీన్

తెలుగులో సినిమాలు చేస్తూ.. మరోవైపు వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు నటుడు నవీన్ బేతిగంటి. తాజాగా ఆయన తనలోని కవిని బయటపెట్టాడు. తన ప్రేయసి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఓ చిరు కవితని.. ఆమె ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

Samayam Telugu 5 Sep 2021, 5:30 pm
'పెళ్లి చూపులు' సినిమాలో అభయ్‌గా నటించిన నవీన్ బేతిగంటి ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస పాత్రలతో బిజీ అయిపోయాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అతను అలరిస్తూ వస్తున్నాడు. ఇక నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు అతను. ‘రమణ యూత్’ అనే సినిమాతో త్వరలోనే దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే నవీన్ తాజాగా తన ప్రేయసి కోసం ఓ కవిత రాశారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ కవిత్వంతో పాటు ఫోటోని కూడా పోస్ట్ చేశారు. అవునండీ.. అయితే ఆమె నిజ జీవితంలో ప్రేయసి కాదు.. సినిమా ప్రేయసి
Samayam Telugu నీ జన్మదినం.. నా పునర్జన్మం.. ప్రేయసిపై కవిత రాసిన యంగ్ హీరో నవీన్
Charitha Kamakshi


నవీన్ బేతిగంటి హీరోగా, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకొని ఈ మధ్య చిన్నచిన్న పాత్రలు వేస్తూ వస్తున్న నటి దివ్య శ్రీపాద హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘చరిత కామాక్షి’. సినిమా బ్యాక్ డ్రాప్ పెళ్లి అయిన భార్య భర్తల మధ్య ఉండే ఘర్షణ, సంతోషం, బాధ లాంటి ఎలిమెంట్స్‌ని ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా దివ్య పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆమె లుక్‌ని విడుదల చేశారు హీరో నవీన్. ఇందులో ఆమె నిండుగా చీరకట్టుకొని చూడముచ్చటగా మనకు కనిపిస్తోంది.
Jeevitha: బండ్ల గణేష్‌తో వివాదాలపై నోరువిప్పిన జీవిత.. గెలుపు, ఓటములపై షాకింగ్ కామెంట్స్
‘నా మాటల జతగా, నీ అడుగులు సాగాలని.. నా కలల అలలుగా, నీ తీరం చేరాలని ఆశిస్తూ.. నీ జన్మదినం.. నా పునర్జన్మం - నీ చక్రవర్తి’ అంటూ నవీన్ ఈ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చి దివ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్‌పై రజిని రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుంగా.. స్త్రీలంక చందు సాయి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అబు ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ఇతర తారాగణం గురించి త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది.
View this post on Instagram A post shared by Naveen Kumar (@imbethiganti)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.