యాప్నగరం

సమంతలో చైతూకు బాగా నచ్చేదేంటో తెలుసా?

త్వరలో తాను పెళ్లి చేసుకోబోయే సమంత గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ్ముడి పెళ్లి తర్వాత తన పెళ్లి ఉంటుందని చెప్పి షాకిచ్చాడు.

TNN 3 Oct 2016, 8:24 pm
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సమంతలో తనకు బాగా నచ్చేది ఆమె ఫ్రాంక్‌నెస్ అని నాగచైతన్య స్పష్టం చేశాడు. వివాహం తర్వాత కూడా సామ్స్ సినిమాల్లో నటిస్తుందని చైతూ క్లారిటీ ఇచ్చాడు. సమంత ఎంతో కష్టపడి ఈ స్థానానికి వచ్చింది. అటువంటి ఆమెను సినిమాలు మానేయమని ఎవరు చెప్పరు. నేను కూడా అదే భావిస్తున్నాను. నాకు తనను సినిమాలు మాన్పించే ఆలోచన అసలు లేదని చైతు అన్నాడు. ఈ విధంగా సమంత అభిమానులకు ఊరటినిచ్చే వార్తను నాగచైతన్య చెప్పాడన్నమాట. ఇటీవల సమంత స్టేట్‌మెంట్ చూసిన ఆమె అభిమానులు పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం కావడం ఖాయమనే అభిప్రాయానికి వచ్చేశారు. ప్రస్తుతం చైతూ ఇచ్చిన క్లారిటీతో వారందరూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తన ప్రియమైన హీరోయిన్ కోసం నాగచైతన్య చాలానే త్యాగాలు చేస్తున్నట్లున్నాడు. అందుకే తమ పెళ్లి కంటే ముందే తమ్ముడు అఖిల్ పెళ్లి ఉంటుందని చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
Samayam Telugu do you know which quality in samantha attracts chaitu
సమంతలో చైతూకు బాగా నచ్చేదేంటో తెలుసా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.