యాప్నగరం

Tarakaratna: బ్లూ కలర్‌లోకి మారిన తారకరత్న శరీరం.. డాక్టర్ కీలక విషయాలు

Nandhamuri Tarakaratna Health: నందమూరి తారకరత్న కండిషన్ ఇంకా క్రిటికల్‌గానే ఉంది. ఐసీయూలో ఆయనకి సీపీఆర్ చేసి పరిస్థితిని కంట్రోల్‌కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. అయితే మెరుగైన చికిత్సకోసం తారకరత్నకి బెంగుళూరుకి తరలించనున్నారు.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 27 Jan 2023, 6:14 pm
నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నందమూరి తారకరత్న (Nandhamuri Tarakaratna) గుండెపోటుకి గురయ్యారు. కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స అందిస్తుండగా.. మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తరలించబోతున్నారు. యాంజియోగ్రామ్ పూర్తైన అనంతరం.. హార్ట్‌లో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
Samayam Telugu tarakaratna cardiac arrest
తారకరత్న హెల్త్


అయితే నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులతో పాటు నందమూరి అభిమానులు ఆందోళనలో ఉన్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. కాగా తారకరత్న శరీరం బ్లూకలర్ లోకి మారిందనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే శరీరం రంగు ఎలాంటి పరిస్థితులో మారుతుంది? తారకరత్నం కండిషన్ ఏంటన్నదానిపై ప్రముఖ కార్డియాలజిస్ట్ ముఖర్జీ.. తన అనుభవాన్ని తెలియజేశారు.

హార్ట్ ఎటాక్ వేరు.. కార్డియాక్ అరెస్ట్ వేరు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు.. పెయిన్ బాగా ఉండటం.. చెమటలు పట్టడం.. కిందపడిపోవడం కూడా ఉంటుంది. కానీ.. కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని నిర్ధారించడం చాలా ముఖ్యం. దాన్ని ఎలా నిర్ధారించాలంటే.. మనం పిలిచినప్పుడు వాళ్లు పలకకపోవడం కానీ.. ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఊపిరి ఆగిపోయి ఉండటం.. పల్స్ అస్సలు లేకపోవడం చూసి కార్డియాక్ అరెస్ట్‌నా కదా అన్నది నిర్ధారిస్తాం.

ఊపిరి ఆడుతున్నా.. పల్స్ ఉన్నా అది కార్డియాక్ అరెస్ట్‌కి కిందికి రాదు. కార్డియాక్ అరెస్ట్ వచ్చిందంటే వెంటనే అత్యవసర చికిత్స అందించాల్సిందే. ఎవరైనా సృహతప్పి పడిపోయినప్పుడు ముందు చేయాల్సింది.. వాళ్లు సృహలో ఉన్నారా లేదా తెలుసుకోవాలి. చాలామంది బ్రెయిన్‌కి బ్లడ్ సప్లయ్ అందక కళ్లు తిరిగిపడిపోతుంటారు. అలాంటి టైంలో ఫ్లాట్‌గా పడుకోబెట్టాలి. బ్లడ్ సప్లైయ్ అందేట్టు చేయాలి. వాళ్ల నుంచి ఏ మాత్రం రెస్పాన్స్ లేనప్పుడు.. ఊపిరి అందుతుందా లేదా అని చూడాలి. మెడపై ఒక నరం కనిపిస్తుంది.. అక్కడ చేయి పెడితే పల్స్ ఉంటుంది. అక్కడ పల్స్ ఉందో లేదో చూడాలి. ఇవన్నీ కూడా పది సెకన్లు లోపు చేయాలి.

కార్డియాక్ అరెస్ట్‌ కాకముందు ఆలస్యం అయినా పర్లేదు.. కోలుకునే అవకాశం ఉంటుంది. తొందరగా సీపీఆర్ చేయాలి. కానీ కార్డియాక్ అరెస్ట్‌ వస్తే మాత్రం.. వెంటనే సీపీఆర్ చికిత్స అందించాలి.

తారకరత్న బాడీ బ్లూ కలర్ లోకి మారిందని అంటున్నారు. ఇది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది అంటే.. ఎప్పుడైతే బ్లస్ సప్లై అన్ని అవయవాలకు అందదో.. అప్పుడు శరీరం బ్లూ కలర్‌లో మారే అవకాశం ఉంది. చేతుల చివర్లో.. కాళ్ల చివర్లో.. పెదాలు బ్లూగా మారే అవకాశం ఉంటుంది. రక్త ప్రసరణ లేనప్పుడు.. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినప్పుడు ఇలా అవుతుంది.

తారకరత్నకి హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటే దాని వల్లే కార్డియాక్ అరెస్ట్‌ వస్తుంది. హార్ట్ ఎటాక్ వస్తే దానికి ట్రీట్ మెంట్ చేసి తొందరగా రికవరీ అవ్వొచ్చు. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ కావొచ్చు. ఇదంతా నార్మల్ పరిస్థితుల్లో.. కానీ కార్డియాక్ అరెస్ట్‌ వల్ల ఏదైనా బ్రెయిన్ డ్యామేజ్ అయినా.. కిడ్నీలపై ప్రభావం చూపినా.. లివర్‌పై ప్రభావం చూపినా.. ఆర్గాన్స్ పనితీరు మెరుగ్గా లేకపోయినా కండిషన్ మారిపోతుంది. హార్ట్ ఎటాక్ వచ్చిన తరువాత గుండె పనితీరు.. దాని పంపింగ్ సిస్టమ్‌పై కూడా చాలా కీలకం. బ్రెయిన్ డ్యామేజ్ లేకపోయినా.. హార్ట్ పంపింగ్ సిస్టమ్ నార్మల్‌గా ఉన్నా.. తొందరగనే రికవరీ అవుతారు.

కార్డియాక్ అరెస్ట్‌ వచ్చిందంటే.. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్గాన్స్‌పై ప్రభావం చూపిస్తుంది. మరో అరగంటలో కిడ్నీస్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఎంత తొందరగా ట్రీట్ మెంట్ చేస్తే అంత త్వరగా ఆర్గాన్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. తారకరత్నకి హాస్పటల్‌కి వెళ్లిన తరువాతే సీపీఆర్ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి.. కిందపడిపోయినప్పుడు కార్డియాక్ అరెస్ట్‌ కాకుండా.. హాస్పటల్‌కి వెళ్లిన తరువాతే కార్డియాక్ అరెస్ట్‌ అయ్యి ఉంటే.. ఆయన తొందరగా కోలుకునే అవకాశం ఉంది. కానీ ముందే కార్డియాక్ అరెస్ట్‌ అయ్యి ఉండి.. సరైన చికిత్స అందడానికి ఆలస్యం అయ్యి ఉంటే మాత్రం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు డాక్టర్ ముఖర్జీ.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.