డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న వేళ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని పోలీసులు అదుపులోకి తీసుకుని, అతడి దగ్గర గంజాయి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రోనీ వ్యక్తిగత జీవితం నాకు ఎలాంటి సంబంధం లేదని కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. డ్రగ్స్‌తో రోనీ పట్టుబడటం తను షాక్‌కు గురయ్యానని, సమాజానికి హానిచేసే ఎలాంటి చర్యను తాను సమర్ధించనని పేర్కొన్నారు. అతడి వ్యక్తిగత జీవితంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, రోనీతో ఉన్నది కేవలం ప్రొఫెషనల్ బంధమేనని స్పష్టం చేసింది. కెరీర్ విషయంలో నా తల్లిదండ్రులు మినహా ఇండస్ట్రీలో నాకు సహాయం చేసే వారందరితోనూ నేను కేవలం వృత్తిపర స్నేహమే కొనసాగిస్తాను. నా వృత్తిపరమైన పనుల్లో సహాయం చేసే వారిని నేను బాగా చూసుకున్నంత మాత్రాన వారి వ్యక్తిగత విషయాలను నియంత్రిస్తున్నానని కాదు.
pic.twitter.com/tT83QBuEOv — Kajal Aggarwal (@MsKajalAggarwal) July 25, 2017
గత కొంతకాలంగా కాజల్‌కు మేనేజర్‌గా పనిచేస్తున్న రోనీ డ్రగ్స్ సేవిస్తున్నాడనే అనుమానంతో పోలీసులు నిఘా పెట్టారు. సోమవారం అతడి ఇంటిలో సోదాలు నిర్వహించిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే రోనీ డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేదా అనే విషయాన్ని వైద్యపరీక్షల ఆధారంగా ధ్రువీకరించనున్నారు. ఒకవేళ రోనీడ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే అతడికి ఎలా లభించాయి. వాటిని ఎవరెవరకి అందించాడనే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాజల్ అగర్వాల్‌తోపాటు రాశీఖన్నా, లావణ్య త్రిపాఠీలకు కూడా రోనీ మేనేజర్‌గా పనిచేశాడు.