యాప్నగరం

ఏం చేసిందని చార్మి వీరనారి... జొన్నవిత్తుల

బుధవారం సిట్ విచారణకు హాజరై చిరునవ్వుతో బయటకు వచ్చిన చార్మిని వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయితో పోలుస్తూ, దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై గేయ రచయిత జొన్నవిత్తుల మండిపడ్డారు.

TNN 27 Jul 2017, 11:25 am
బుధవారం సిట్ విచారణకు హాజరై చిరునవ్వుతో బయటకు వచ్చిన చార్మిని వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయితో పోలుస్తూ, దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై గేయ రచయిత జొన్నవిత్తుల మండిపడ్డారు. "వర్మ... సిట్ అధికారి కార్యాలయం నుంచి వస్తున్న చార్మిని చూస్తుంటే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఉందని, ఇంతకు ముందు కంటే చాలా అందంగా కనిపించిందని ప్రశంసించారు. ఇది చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్య, ఆయన దాన్ని వెనక్కు తీసుకోవాలని జొన్నవిత్తులు అన్నారు. ఎందుకంటే, చార్మి వీరనారి కాదు... సిట్ అధికారులు ఆంగ్లేయులు కాదు. మత్తుపదార్థాల కేసులో అనుమానితురాలిగా ఆవిడను పిలిచి, విచారించారని ఆయన పేర్కొన్నారు. విచారణ ముగించుకుని బయటకు వచ్చినప్పుడు ఆవిడ నిబ్బరంగా ఉందని అనొచ్చు. లేకుంటే, మరో విధంగా ఆమెను ప్రశంసించొచ్చని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సూచించారు. దానికేమీ ఎవరికీ అభ్యంతరాలు ఉండవుగానీ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించిందనడం ఇబ్బందికరమైన వ్యాఖ్యని తప్పుబట్టారు.
Samayam Telugu drug scandal lyricist jonnavithula counter to ramgopal varma
ఏం చేసిందని చార్మి వీరనారి... జొన్నవిత్తుల


ఝాన్సీని దేశభక్తికి ప్రతీకగా, ప్రతినిధిగా ప్రజలందరూ ఆరాధారిస్తారు. చార్మి ఝాన్సీలా కనిపించిందంటే, ఆమెలో అందం కనిపించకూడదు. సాహసం, పరాక్రమం, త్యాగం... ఇవే కనిపించాలి. అలా కాకుండా, ఇలా వ్యాఖ్యానించడం, చాలామందిని ఆగ్రహావేశాలకు గురి చేస్తోంది. ఈ వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటే మంచిది. సిట్‌పై ఆయన అభిప్రాయాలను వెల్లడించవచ్చు. కానీ, దేశభక్తురాలితో చార్మిని పోల్చడం తగదని అన్నారు. అంతే కాదు రాంగోపాల్ వర్మ ప్రతిష్ఠక మచ్చగా ఇది మిగిలిపోతుందని జొన్నవిత్తుల వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.