యాప్నగరం

నవదీప్‌ను కాపాడేందుకు రంగలోకి ఐదుగురు అగ్రహీరోలు

డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న నవదీప్‌ను బయటపడేయడానికి ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్లు సమాచారం. టాలీవుడ్‌లో డ్రగ్స్ దందాలు బయటకు వచ్చిన ప్రతిసారీ నవదీప్ పేరు వినబడుతునే ఉంటుంది.

TNN 14 Jul 2017, 11:28 am
డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న నవదీప్‌ను బయటపడేయడానికి ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్లు సమాచారం. టాలీవుడ్‌లో డ్రగ్స్ దందాలు బయటకు వచ్చిన ప్రతిసారీ నవదీప్ పేరు వినబడుతునే ఉంటుంది. తాజాగా బయటపడ్డ డగ్స్ రాకెట్టుతో టాలీవుడ్ సంబంధాలపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ప్రారంభించిన వెంటనే నవదీప్ అప్రమత్తమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. దీంతో నవదీప్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఐదుగురు అగ్రహీరోలను సంప్రదించి, తనను బయటపడేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ ఐదుగురు అగ్రహీరోలకు నవదీప్ తరచూ ఖరీదైన పార్టీలను ఏర్పాటు చేసేవాడని సమాచారం. అందుకే నవదీప్‌పై వారికి అంతులేని ఆపేక్ష అని, దీంతోనే వారు అతడిని రక్షించేందుకు రంగంలోకి దిగారని అంటున్నారు.
Samayam Telugu drugs case telangana police notice to hero navadeep
నవదీప్‌ను కాపాడేందుకు రంగలోకి ఐదుగురు అగ్రహీరోలు


ఈ కేసులో రవితేజతోపాటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కూడా అధికారులు నోటీసులు పంపారు. ఇంకా నోటీసులు అందుకున్న వారిలో హీరో తరుణ్, నటుడు సుబ్బరాజు, గాయని గీతా మాధురి భర్త నందు, యువ హీరో తనీష్, నవదీప్, హీరోయిన్ చార్మి, ఐటమ్ డాన్సర్ ముమైత్ ఖాన్, శ్యామ్ కె. నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్రీనివాసరావు ఉన్నారు. వీరంతా ఈ నెల 19 నుంచి 27 వరకు వ్యక్తిగతం విచారణకు హాజరుకావాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.