యాప్నగరం

యాంకర్ ప్రదీప్‌కు జైలు శిక్ష?

మద్యం తాగి పట్టుబడేవారి నుంచి సాధారణంగా 150 పాయింట్లను మోస్తారుగాను, అది మించితే తీవ్రంగాను పరిగణిస్తారు. కానీ, ప్రదీప్ మద్యం మోతాదు 178 పాయింట్లను దాటింది.

TNN 1 Jan 2018, 10:32 pm
నూతన సంవత్సరం వేడుకలు యాంకర్ ప్రదీప్‌కు చేదు అనుభవం మిగిల్చాయి. తాగి కారు నడుపుతూ.. పోలీసులకు అడ్డంగా బుక్కయిన ప్రదీప్‌పై మరో కేసు నమోదు కానుంది. మద్యం తాగి పట్టుబడేవారి నుంచి సాధారణంగా 150 పాయింట్లను మోస్తారుగాను, అది మించితే తీవ్రంగాను పరిగణిస్తారు. కానీ, ప్రదీప్ మద్యం మోతాదు 178 పాయింట్లను దాటింది. దీంతో, మంగళవారం మూడు గంటలపాటు కౌన్సిలింగ్‌ ఇచ్చి, కోర్టులో ప్రవేశపెడతారు.
Samayam Telugu drunk and drive anchor pradeep to be sentenced
యాంకర్ ప్రదీప్‌కు జైలు శిక్ష?


నిబంధనల ప్రకారం.. 150 పాయింట్లు వస్తే రెండు రోజులు, 150 దాటితే దాదాపు వారం రోజులు జైలు శిక్ష పడవచ్చని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రదీప్‌కు జైలు శిక్ష వేస్తారా లేదా? జరిమానా విధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే, ప్రదీప్ తన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ కూడా తొలగించలేదు. దీనిపై పోలీసులు మరో కేసు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రదీప్ కారు జూబ్లిహిల్స్ పోలీసుల ఆధీనంలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.