యాప్నగరం

సావిత్రి కోసం మరో నటుడు ‘ఓకే’!

మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకముందు నుండే జనాల్లో హైప్ పెంచుకుంటూ వస్తోంది.

TNN 24 Apr 2017, 4:17 pm
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకముందు నుండే జనాల్లో హైప్ పెంచుకుంటూ వస్తోంది. ఈ సినిమా కాస్టింగ్ కోసం దర్శకుడు నాగశ్విన్ నెలలు తరబడి అన్వేషిస్తున్నాడు. ఇందులో భాగంగా లీడ్ రోల్ కోసం కీర్తి సురేష్‌ను ఎన్నుకున్నాడు.
Samayam Telugu dulquer salmaan to play gemini ganesan in savitris biopic
సావిత్రి కోసం మరో నటుడు ‘ఓకే’!


అలానే మరో రెండు ముఖ్య పాత్రల్లో సమంత, అనుష్కలను ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ కథలో మరో కీలకమైన పాత్ర సావిత్రి భర్త జెమినీ గణేషన్ పాత్ర కోసం మొదటగా సూర్య, ఆ తరువాత ప్రకాష్ రాజ్‌ల పేర్లు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఎట్టకేలకు జెమిని గణేషన్ పాత్ర పోషించేది ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.

ఓకే బంగారం సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయిన దుల్కర్ సల్మాన్‌ను జెమిని గణేషన్ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్, అనుష్క, సమంతలను ఎన్నుకోవడంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ద్వారా మలయాళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తానికి సౌత్‌లో ఉన్న ఏ ఒక్క భాషను విడిచిపెట్టకుండా అందరిని దృష్టిని తన సినిమా వైపు పడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగాశ్విన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.