యాప్నగరం

Sita Ramam Day 1 Collections : ‘సీతారామం’ తొలిరోజు వసూళ్లు.. ఏరియాల వైజ్‌గా

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంట‌గా న‌టించిన చిత్రం ‘సీతారామం’. మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన‌ మలయాళ స్టార్ హీరో దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan). తాజాగా సీతా రామం (Sita Ramam) వంటి క్లాసిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు దుల్కర్ వచ్చారు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందిన ఆగస్ట్ 5న రిలీజైంది. సినిమా తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను సంపాదించుకుంది. సినిమా తొలి రోజు వ‌సూళ్లు ఏరియాల వైజ్‌గా..

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 6 Aug 2022, 12:44 pm
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంట‌గా న‌టించిన చిత్రం ‘సీతారామం’. మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన‌ మలయాళ స్టార్ హీరో దుల్కార్ సల్మాన్ (Dulquer Salmaan). ఆ మూవీలో దుల్కార్ యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. తాజాగా సీతా రామం (Sita Ramam) వంటి క్లాసిక్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు దుల్కర్ వచ్చారు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ ఆగస్టు 5నరిలీజ్ అయింది. సినిమా తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను సంపాదించుకుంది.
Samayam Telugu Sita Ramam
సీతారామం


‘సీతారామం’ తొలి రోజు వ‌సూళ్లు ఏరియాల వైజ్‌గా ఎంత వ‌సూళ్లు చేసింద‌నే వివ‌రాల్లోకి వెళితే..

నైజాం - రూ. 54 ల‌క్ష‌లు

సీడెడ్ - రూ. 16 ల‌క్ష‌లు

ఉత్త‌రాంధ్ర - రూ. 23 ల‌క్ష‌లు

ఈస్ట్ - రూ. 15 ల‌క్ష‌లు

వెస్ట్ - రూ. 8 ల‌క్ష‌లు

గుంటూరు - రూ. 15 ల‌క్ష‌లు

కృష్ణ - రూ. 13 ల‌క్ష‌లు

నెల్లూరు - రూ. 5 ల‌క్ష‌లు

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమాకు రూ. 2.25 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. షేర్ వ‌సూళ్ల పరంగా చూస్తే రూ. 1.50 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 ల‌క్ష‌లు ఇత‌ర భాష‌ల్లో రూ. 35 ల‌క్ష‌లు.. ఓవ‌ర్ సీస్ రూ. 1.05 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే సీతారామం చిత్రానికి రూ. 3.05 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్లు ప్ర‌కారం చూస్తే రూ. 5.60 కోట్లు అని సినీ వ‌ర్గాలంటున్నాయి.

సీతారామం సినిమా రూ. 16.20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జ‌రుపుకుంది. హిట్ కావాలంటే సినిమా రూ. 17 కోట్లు రాబ‌ట్టుకోవాలి. అంటే సినిమా హిట్ కావాలంటే ఇంకా రూ. 13.95 కోట్లు వ‌సూళ్లు రావాల‌ని స‌మాచారం.
రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.