యాప్నగరం

పెళ్లిచూపులు హీరో ‘ద్వారక’‌ రెడీ!

"పెళ్లిచూపులు"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక" విడుదలకు రెడీ అయ్యింది.

TNN 10 Feb 2017, 6:24 pm
Samayam Telugu dwaraka movie release date conformed
పెళ్లిచూపులు హీరో ‘ద్వారక’‌ రెడీ!
"పెళ్లిచూపులు"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక". విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. "లెజెండ్ సినిమా" బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు నిర్మాతలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదలతోపాటు సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకోవడంతో మార్చి 3న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర మాట్లాడుతూ.. "క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ద్వారక" ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దొంగ స్వామిజీగా విజయ్ దేవరకొండ నటన, పూజా ఝావేరి గ్లామర్, వైవిధ్యమైన కథ-కథనాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. విడుదలైన పాటలతోపాటు.. ట్రైలర్‌కి కూడా మంచి ఆదరణ లభించింది. సినిమాకి కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు. పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.