యాప్నగరం

‘ద్యావుడా’డైరెక్టర్ పత్రికాముఖ క్షమాపణ

నూతన సంవత్సరంలో మొదటి రోజున విడుదలైన 'ద్యావుడా' చిత్ర టీజర్‌ సృష్టించిన అలజడి అంతా ఇంతాకాదు.

TNN 9 Jan 2017, 10:12 pm
నూతన సంవత్సరంలో మొదటి రోజున విడుదలైన 'ద్యావుడా' చిత్ర టీజర్‌ సృష్టించిన అలజడి అంతా ఇంతాకాదు. దాంతో దర్శకుడు సాయిరాం దాసరి పత్రికాముఖంగా హిందువులకు క్షమాపణలు తెలిపారు. ''హిందువుల మనో భావాలను దెబ్బతీయాలనేది నా ఉద్దేశం కాదు. నేనూ హిందువునే. కానీ ఇంతమంది నా సినిమా టీజర్‌ చూసి స్పందిస్తుంటే దానికి బాధ్యత వహిస్తూ ముందుగా హిందూ సోదరులందరికీ క్షమాపణ తెలుపుతున్నాను.
Samayam Telugu dyavudaa film director sairam dasari apologies audience
‘ద్యావుడా’డైరెక్టర్ పత్రికాముఖ క్షమాపణ


కాకపోతే కర్ణాటకలోని ఉజ్జయిని దేవాలయంలో సిగరెట్లు, మద్యంతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉంది. మేము ఆ ఆచారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో చివరికి శివమహత్యాన్ని చూపించే ప్రయత్నం చేశాం. కానీ సినిమా విడుదలకు ముందే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించి.. ఆ దృశ్యాలను మా సినిమా నుంచి తొలగిస్తున్నాము. ఈ సందర్భంగా మరోసారి తెలుగు భక్తులకు నేను క్షమాపణ తెలుపుతున్నాను'' అని ఆ ప్రకటనలో తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.