యాప్నగరం

Orey Bujjiga: ‘ఈ మాయ పేరేమిటో’ సాంగ్.. మాయ చేసిన సిద్ శ్రీరామ్

సిద్ శ్రీరామ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో సెన్సేషనల్ సింగర్. ఆయన ఏ పాట పాడినా అది హిట్టే. ఆయన పాడిన ‘సామజవరగమన’, ‘నీలి నీలి ఆకాశం’ పాటలు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ఆయన తాజాగా మరో అందమైన పాటను ఆలపించారు.

Samayam Telugu 12 Mar 2020, 5:38 pm
యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. ఉగాది కానుకగా మార్చి 25న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఈ మాయ పేరేమిటో’ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రచించారు.
Samayam Telugu Orey_Bujjiga
‘ఒరేయ్ బుజ్జిగా’లో రాజ్ తరుణ్, మాళవిక


ప్రస్తుతం సిద్ శ్రీరామ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. తెలుగులో ఆయన ఏ పాట పాడినా అది సెన్సేషన్ అయిపోతోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సామజవరగమన’, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’లో ‘నీలి నీలి ఆకాశం’, ‘రాహు’లో ‘ఏమో ఏమో’.. ఇలా ప్రతి పాట అద్భుతమే. తాజాగా ఆ స్వరం నుంచి జాలువారిన మరో అందమైన పాట ‘ఈ మాయ పేరేమిటో’. అనూప్ రూబెన్స్ - సిద్ శ్రీరామ్ కాంబోలో వచ్చిన మరో మంచి సాంగ్ ఇది. నీలి నీలి ఆకాశం పాటను కూడా అనూప్ రూబెన్సే స్వరపరిచారు. కిట్టు సాహిత్యం కూడా చాలా సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ఉంది.

Also Read: మళ్లీ ‘అల్లుడు’గా వస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

కాగా, ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నంద్యాల రవి మాటలు రాశారు. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్. శేఖర్‌ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.