యాప్నగరం

ఫోన్ కాల్స్‌‌, కామెంట్లతో వేధిస్తున్నారు: అనసూయ

అభిమానులకు ట్విట్టర్ ద్వారా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పిన యాంకర్ అనసూయ.. తనను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

TNN 26 Jan 2018, 2:21 pm
అభిమానులకు ట్విట్టర్ ద్వారా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పిన యాంకర్ అనసూయ.. తనను కించపరిచేలా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. తన పట్ల కొందరు వ్యవహరిస్తోన్న తీరును జబర్దస్ యాంకర్ తీవ్రంగా నిరసించింది. నాకు నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించింది. సంప్రదాయం, సంస్కృతి పేరిట కొందరు గుండాలు నా గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ వాపోయింది.
Samayam Telugu every day i face call and comments anasuya bharadwaj
ఫోన్ కాల్స్‌‌, కామెంట్లతో వేధిస్తున్నారు: అనసూయ


‘డియర్ ఇండియా.. ఓ కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, అమ్మగా.. మిగతా వాళ్లలాగే నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను. నా పని, నేను వస్త్రధారణ పట్ల మా ఇంట్లో వాళ్లపై ఎలాంటి ప్రభావం లేదు. కానీ ఇతరులపై ప్రభావం చూపుతున్నట్లుగా ఉంది. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని కొందరు నన్ను కించపరిచేలా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. నా పట్లే కాదు, నా భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులను అగౌరవ పరుస్తున్నారు. నిత్యం ఫోన్ కాల్స్, కామెంట్ల ద్వారా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. వాటి గురించి తెలుసుకునే శక్తి కూడా మీకు లేదు’ అని అనసూయ ట్వీట్ చేసింది.


నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ లేదా? నా గౌరవాన్ని కాలితో నలిపేస్తారా? ఇలాగే జీవించాలా? దీని గురించి ఏం చేయలేమా అని అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ బాధ్యతాయుతమైన మహిళగా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రశ్నిస్తున్నా. స్వేచ్ఛ అంటే ఇదేనా అని అనసూయ ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.