యాప్నగరం

GG Krishna Rao: శంక‌రా భ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం చిత్రాల ఎడిట‌ర్ జి.జి.కృష్ణారావు క‌న్నుమూత‌

GG Krishna Rao passed away: దాస‌రి నారాయ‌ణ‌రావు, కె.విశ్వ‌నాథ్‌, బాపు, రాఘ‌వేంద్ర‌రావు వంటి లెజండ్రీ ద‌ర్శ‌కుల‌తో వ‌ర్క్ చేసిన సీనియ‌ర్ ఎడిట‌ర్ జి.జి.కృష్ణారావు మంగ‌ళ‌వారం ఉద‌యం బెంగుళూరులో క‌న్నుమూశారు.

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 21 Feb 2023, 9:58 am
GG Krishna Rao Death: టాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. సీనియ‌ర్ ఎడిట‌ర్ జి.జి.కృష్ణారావు మంగ‌ళ‌వారం ఉదయం బెంగుళూరులో కన్నుమూశారు. 200 చిత్రాలకు పైగా ఈయ‌న ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. టాలీవుడ్ లెజండ్రీ ద‌ర్శ‌కులుగా మ‌నం చెప్పుకునే ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్‌(K Viswanath), బాపు, జంధ్యాల వంటి వారితో ఈయ‌న వ‌ర్క్ చేశారు. తెలుగు ప్రేక్ష‌కులు మ‌రపురాని చిత్రాల‌ను రూపొందించిన నిర్మాణ సంస్థ పూర్ణోద‌య క్రియేష‌న్స్, విజ‌య మాధ‌వి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌లో ప‌ని చేశారు.
Samayam Telugu GG Krishna Rao
GG Krishna Rao


ALSO READ: Kantara 2: ‘కాంతార 2’లో సూపర్ స్టార్ రజినీకాంత్
కె.విశ్వనాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన శంక‌రాభ‌ర‌ణం, సాగ‌ర సంగ‌మం, స్వాతిముత్యం, శుభ‌లేఖ‌, సిరి వెన్నెల‌, శ్రుతిల‌య‌లు వంటి చిత్రాలతో పాటు దాస‌రి డైరెక్ట్ చేసిన బొబ్బిలి పులి, స‌ర్దార్ పాపారాయుడు, జంధ్యాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నాలుగు స్తంభాలాట‌, బాపు రూపొందించిన శ్రీరామ‌రాజ్యం చిత్రాల‌కు ఎడిట‌ర్‌గా (Telugu film editor) ప‌ని చేశారు జి.జి.కృష్ణారావు. ఇంకా మ‌రెన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల్లో ఆయ‌న త‌న వంతు బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్ద‌వంతంగా పూర్తి చేశారు.

ALSO READ: Jr Ntr - Taraka Ratna: తారకరత్నకు జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సాయం!

బాల న‌టుడిగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ 1983లో హీరోగా మారారు. అదే ఏడాది ఆయ‌న కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌ననీ జ‌న్మ‌భూమి అనే చిత్రంలో న‌టించారు. ఆ సినిమాకు జి.జి.కృష్ణారావు నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు. కె.విశ్వ‌నాథ్‌గారితో జి.జి.కృష్ణారావుకి మంచి అసోషియేష‌న్ ఉండేది. ఇదే నెల‌లోనే విశ్వ‌నాథ్ చ‌నిపోయారు. ఇప్పుడు జి.జి.కృష్ణారావు చ‌నిపోయారు. ఆయ‌న మృతిపై చిత్ర పరిశ్ర‌మలోని ప్ర‌ముఖులు సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ALSO READ: Puli Meka trailer: పోలీసుల‌ను చంపే హంత‌కుడి కోసం సాగే వేట ‘పులి మేక’
ALSO READ: Chiranjeevi: ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్‌గా మెగాస్టార్.. పవన్ కళ్యాణ్ సాంగ్ రీమిక్స్‌లో చిరు స్టెప్పులు
రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.