యాప్నగరం

హరితేజ.. శివారెడ్డితో నువ్విలా చేయడమేంటి?

బిగ్ బాస్ షోతో అలరించిన హరితేజకు ఇప్పుడు భారీ అవకాశాలే వస్తున్నాయి. వాటితోపాటు విమర్శలు కూడా మొదలయ్యాయి.

TNN 20 Oct 2017, 6:57 pm
బిగ్ బాస్ షోతో వచ్చిన పాపులారిటీని హరితేజ సద్వినియోగం చేసుకుంటోంది. సినిమా అవకాశాలే కాకుండా.. ఫిదా ప్రోగ్రాంతోపాటు అనేక ఛాన్స్‌లను ఈ టాలెంటెడ్ లేడీ సొంతం చేసుకుంటోంది. దీపావళి సందర్భంగా ఏపీ సర్కారు నిర్వహించిన ‘తిరుపతి దీపావళి ఉత్సవం’లోనూ ఆమె హోస్ట్‌గా వ్యవహరించింది. ఇందులో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి కూడా ఆమెతోపాటు యాంకరింగ్ చేశారు. ఆధ్యాత్మిక భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వీరిద్దరూ సమర్థవంతంగా నడిపారు. ఒకరితో మరొకరు పోటీ పడి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు.
Samayam Telugu fans criticizing hari teja over action at tiruapati deepavali utsavam
హరితేజ.. శివారెడ్డితో నువ్విలా చేయడమేంటి?


కానీ హరితేజ కాస్త ఓవర్ యాక్షన్ చేసిందని కొందరు అభిమానులు చెబుతున్నారు. వీరిద్దరి యాంకరింగ్ హాస్యాన్ని పంచినప్పటికీ.. జుగుప్సాకరంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. స్టేజీ మీద హరితేజ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. సెటైర్లు వేసుకోవడం కాస్త శ్రుతి మించిందంటున్నారు. హరితేజ లాంటి టాలెంటెడ్ పర్సన్ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

బిగ్ బాస్‌ షోలో అద్భుతంగా ఆకట్టుకున్న హరితేజ హరి కథ ఎపిసోడ్‌ను ఒంటి చేత్తో రక్తి కట్టించారు. తన హావభావాలతో, మాటతీరుతో అందరి మన్నలు పొందారు. అలాంటి నటి ఇలా చేయడాన్ని అభిమానులు జీర్ణించుకో లేకపోతున్నారు. మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.