యాప్నగరం

12రోజులు పడుకుంటే.. సినిమా ఛాన్స్!

సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలను ట్రీట్ చేసే విధానం గురించి చెబుతున్న మాటలతో వార్తల్లో నిలుస్తున్న

TNN 13 Dec 2017, 4:51 pm
సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలను ట్రీట్ చేసే విధానం గురించి చెబుతున్న మాటలతో వార్తల్లో నిలుస్తున్న ఫిదా నటి గాయత్రి.. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒకింత సంచలన వ్యాఖ్యలే చేసింది. తనకు వచ్చిన ఒక సినీ ఆఫర్ గురించి ఆమె ఆసక్తిదాయక విషయాలను బయటపెట్టింది. తను ఫిదాకు ముందు అనేక సినిమాలు చేశాను అని.. అయితే వాటితో రాని గుర్తింపు ఫిదాతో వచ్చిందని ఈమె చెప్పింది.
Samayam Telugu fidaa actress hot comments
12రోజులు పడుకుంటే.. సినిమా ఛాన్స్!


‘ఇంతకు ముందు కొన్నాళ్ల కిందట ఒక బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చింది. అందులో నటించడానికి సంబంధించి ఒక మేనేజర్ నాతో మాట్లాడాడు. పన్నెండు రోజుల పాటు కమిట్ అయితే.. ఒక ఫ్లాట్, కారు, పది లక్షల రూపాయల డబ్బు.. సినిమాలో అవకాశం ఇస్తాం..అని ఆయన అన్నాడు...’ అని గాయత్రి వివరించింది. పన్నెండు రోజుల పాటు కమిట్ కావడం ఏమిటి? అంటే.. ‘పడుకోవడం..’ అని బదులు ఇచ్చింది ఈ నటీమణి.

ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అమ్మాయిల ప్రతిభను చూడరు అని, ‘పడుకోవడం..’ అనే మాటే ప్రధానంగా వినిపిస్తుంది అని, ఆ ఉద్దేశం ఉందా? లేదా? అనే విషయాన్ని మొహమాటం లేకుండా అడుగతారని... ఓకే చెబితే అవకాశం, లేకపోతే లేదు.. అనే కండిషన్ ఉండనే ఉంటుందని గాయత్రి వివరించింది. పన్నెండు రోజుల పాటు కమిట్ మెంట్ అడిగిన మేనేజర్ తో తను ఇంకేం అడగలేదని.. ఆ సినిమా అవకాశాన్ని వదిలేసుకున్నానని ఈమె చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.