యాప్నగరం

‘ఫిదా’ అవుతున్న ఓవర్‌సీస్‌..!

శేఖర్ కమ్ముల చాలా కాలం తర్వాత తనదైన శైలిలో తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాకు ఓవర్‌సీస్ ఫిదా అయిపోతోంది. మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి..

TNN 16 Aug 2017, 11:07 am
శేఖర్ కమ్ముల చాలా కాలం తర్వాత తనదైన శైలిలో తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాకు ఓవర్‌సీస్ ఫిదా అయిపోతోంది. మెగా హీరో వరుణ్ తేజ్, మల్లార్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా స్టార్ హీరోల రికార్డులను సైతం బద్ధలు కొడుతూ దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి మంచి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన ఈ సినిమా అమెరికాలోనూ భారీ వసూళ్లను రాబడుతోంది.
Samayam Telugu fidaa is now 6th highest grosser of all time in usa
‘ఫిదా’ అవుతున్న ఓవర్‌సీస్‌..!


రెండు రోజుల కిందటే 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ఫిదా.. యూఎస్ఏలో ఇప్పటి వరకు 2,022,801 డాలర్లు వసూలు చేసింది. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ వసూళ్ల(2,022,384 డాలర్లు)ను వెనక్కినెట్టి యూఎస్ఏలో అత్యధిక కలెక్షన్లు సాధించిన 6వ తెలుగు చిత్రంగా ‘ఫిదా’ కొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా కంటే ముందు బాహుబలి-2, బాహుబలి-1, ఖైదీ నెం. 150 తదితర సినిమాలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.